ప్రభాస్‌కు తినడం ఇష్టం అంతేకాకుండా.. అంటూ ఆసక్తికర విషయం చెప్పిన పూజా
బాహుబలి సినిమాలతో ఇండియన్ స్టార్‌గా ఎదిగి, సాహోతో మరోసారి తన ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చిన ప్రభాస్ అంటూ దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సామాన్య జనాల్లోనే కాదు సెలబ్రెటీల్లోనూ ఆయనకు అభిమానులున్నారు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న పూజా హెగ్డే ప్రభాస్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.రాధా కృష్ణ డైరెక్షన్‌లో ప్రభాస్ చేస్తోన్న జాన్ అనే చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోందన్న విషయం తెలిసిందే. ఈపాటికే కొంత భాగం షూటింగ్‌ను కూడా పూర్తి చేసింది చిత్రబృందం.
బాహుబలి సినిమాలతో ఇండియన్ స్టార్‌గా ఎదిగి, సాహోతో మరోసారి తన ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చిన ప్రభాస్ అంటూ దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సామాన్య జనాల్లోనే కాదు సెలబ్రెటీల్లోనూ ఆయనకు అభిమానులున్నారు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న పూజా హెగ్డే ప్రభాస్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

రాధా కృష్ణ డైరెక్షన్‌లో ప్రభాస్ చేస్తోన్న జాన్ అనే చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోందన్న విషయం తెలిసిందే. ఈపాటికే కొంత భాగం షూటింగ్‌ను కూడా పూర్తి చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ప్రభాస్ లండన్‌లో ఉన్నాడు. బాహుబలి మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్ జరగుతున్న ఈవెంట్‌కు వెళ్లాడు.
పూజా హెగ్డే ప్రస్తుతం హౌస్‌ఫుల్ 4 మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. అక్షయ్ కుమార్, రితీష్ దేశ్‌ముఖ్, కృతిసనన్, పూజా హెగ్డే లాంటి స్టార్లతో తెరకెక్కిన ఈ మూవీ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అక్షయ్ వదిలిన బాలా చాలెంజ్ అందర్నీ ఆకట్టుకుంటూ.. వైరల్‌గా మారింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజాకు ప్రభాస్‌కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ప్రభాస్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ప్రభాస్‌కు తినడం ఇష్టం.. అంతేకాకుండా.. అందరికీ ఎంతో ఇష్టంగా వడ్డిస్తాడు.. వాళ్ల ఇంటి నుంచి వచ్చే భోజనం ఎంతో రుచికరంగా ఉంటుందని తెలిపింది.


Click it and Unblock the Notifications











