జార్జియాలో హాట్ హీరోయిన్‌తో ప్రభాస్‌ రొమాన్స్.. అసలేం జరుగుతుందంటే!

సాహో మూవీ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. యూవీ క్రియేషన్స్ రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో 20వది కావడం గమనార్హం. ఈ చిత్రానికి రాధే శ్యామ్, ఓ డియర్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్స్ ఎపిసోడ్స్‌ను విదేశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, హాలీవుడ్ నిపుణులతో చిత్రీకరించారు. ఈ విషయాన్ని యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

 క్యూట్ ఛేజ్ ముగిసింది..

క్యూట్ ఛేజ్ ముగిసింది..

ప్రభాస్20 మూవీ షూటింగ్ గురించి యూవీ క్రియేషన్స్ వివరాలు అందజేస్తూ.. ఓ క్యూట్ ఛేస్ సీక్వెన్స్ ఇటీవల షూట్ చేశాం. ఈ సీక్వెన్స్‌కు టెర్రిఫిక్ ఇంటర్నేషనల్ యూనిట్ పనిచేసింది. ఇటీవలే ఇటలీలో ఈ సన్నివేశాల చిత్రీకరణ ముగిసింది. ఇక ఈ సినిమా జార్జియాలో సుదీర్ఘమైన షూటింగ్ జరుపుకోవడానికి వేచి చూస్తున్నది అని ట్వీట్‌లో స్పష్టం చేసింది.

 జార్జియాలో 20 రోజులపాటు

జార్జియాలో 20 రోజులపాటు

ప్రభాస్ 20 సినిమా విషయానికి వస్తే.. దాదాపు 20 రోజులపాటు జార్జియాలో షూటింగ్‌ జరుపుకోవడానికి సిద్ధమవుతున్నది. మార్చి 20 రోజుల షెడ్యూల్ కోసం 15వ తేదీన ప్రయాణం కాబోతున్నది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, పూజా హెగ్డేపై ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఈ సీన్లను అవుట్ డోర్ కాకుండా ఇంటీరియర్‌లో చిత్రీకరిస్తారని చిత్ర యూనిట్ పేర్కొన్నది.

మార్చి 25న ఫస్ట్‌లుక్

మార్చి 25న ఫస్ట్‌లుక్

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను దశలవారీగా చేపట్టేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నది. మార్చి 25న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. తెలుగు సంవత్సర ఉగాది పండుగ రోజున అభిమానులు ఆకట్టుకొనే విధంగా ఫస్ట్‌లుక్‌ను రూపొందిస్తున్నట్టు సమాచారం.

Recommended Video

Prabhas 21 Movie Update | Prabhas 21 Movie Concept
 దసరా కానుకగా ప్రభాస్20

దసరా కానుకగా ప్రభాస్20

ప్రభాస్20 సినిమాను గోపికృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నది. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహించే ఈ సినిమాను దసరా కానుకగా లేదా ప్రభాస్ బర్త్ డే రోజున అంటే అక్టోబర్ 23న కానీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే అంటే జూన్‌లో నాగ్ అశ్విన్ రూపొందించే చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంటారని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X