Radhe Shyam కోసం ఆ పని పూర్తి చేసిన పూజా హెగ్డే: ఆమె తర్వాత ప్రభాస్ వంతేనట

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. దీనికి కారణం మన సినిమా స్టామినా దేశ వ్యాప్తం కావడమే. అందుకే మన హీరోలకు సైతం అన్ని ప్రాంతాల్లో మార్కెట్ బలపడుతోంది. ఇలా కొంత కాలంగా భారీ చిత్రాలనే చేస్తూ పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతోన్న వారిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పేరును ప్రముఖంగా చెప్పుకోవాలి. దర్శకధీరుడు తెరకెక్కించిన 'బాహుబలి' నుంచి అతడు దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. దీంతో అన్నీ పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు వరుసగా ఎన్నో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమాల్లో 'రాధే శ్యామ్' ఒకటి. జిల్ మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపును అందుకున్న రాధాకృష్ణ కుమార్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్లకు పైగా అవుతోంది. మధ్యలో కరోనా లాక్‌డౌన్‌తో పాటు పలు ఆటంకాలు ఏర్పడడంతో ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో సుదీర్ఘ ప్రయాణం తర్వాత అంటే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అవి కూడా దాదాపుగా కంప్లీట్ అయ్యాయి.

Pooja Hegde Wrapped Dubbing for Prabhass Radhe Shyam

ప్రభాస్ - పూజా హెగ్డే కాంబోలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'రాధే శ్యామ్' మూవీ నుంచి ఇటీవలే 'ఈ రాతలే' అంటూ సాగే సాఫ్ట్ మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు. దీనికి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. అదే సమయంలో పలు రికార్డులు కూడా నమోదయ్యాయి. ఆ వెంటనే 'నగుమోము తారలే' అంటూ సాగే ఓ రొమాంటిక్ ఫీల్‌ గుడ్ మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు. ఇది కూడా మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ప్రమోషన్ పనులు ఇలా జరుగుతుండగా.. సినిమాకు సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ కూడా శరవేగంగానే సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ బయటకు వచ్చింది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'రాధే శ్యామ్' మూవీకి సంబంధించిన డబ్బింగ్ పనులు నాలుగు రోజుల క్రితమే ప్రారంభం అయ్యాయట. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర హీరోయిన్ పూజా హెగ్డే డబ్బింగ్ వర్క్‌ను పూర్తి చేసిందని తెలిసింది. ఈ సినిమా కోసం ఆమె డబ్బింగ్ చెబుతుండగా తీసిన ఫొటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే సమయంలో ఆమె డబ్బింగ్ వర్క్‌ను కంప్లీట్ చేసిందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక, ఆమె తర్వాత హీరో ప్రభాస్ ఈ పనులను ప్రారంభించబోతున్నాడట.

'రాధే శ్యామ్' మూవీలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే, ఇది టైమ్ ట్రావెల్ కథ అని, పునర్జన్మల నేపథ్యంతో సాగే సినిమా అని అంటున్నారు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, భాగ్యశ్రీ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, ఫ్లోరా జాకబ్ వంటి వాళ్లు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X