Allu Vs Mega Issue: మెగా అల్లు వివాదంలోకి దూరిన పూనమ్ కౌర్.. అలాంటి పోస్ట్ తో సంచలనం
మెగా వర్సెస్ అల్లు అంటూ సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ఓ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల సమయంలో ప్రారంభమైన ఈ కోల్డ్ వార్.. రోజురోజుకి ముదురుతోంది. వారి ఫ్యామిలీల్లో వ్యవహారం ఎలా ఉందో తెలియదు గానీ, సోషల్ మీడియాలో మాత్రం హై రేంజ్ కు చేరింది. ఈ ఫ్యామిలీ వార్ కాస్త ఇప్పుడు ఫ్యాన్స్ వార్ గా మారిపోయింది. ఎంతలాంటే.. మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది.
సోషల్ మీడియాలో ఏ ఫ్లాట్ ఫాంలో చూసినా.. మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య ట్వీట్స్, ట్రోల్స్ వార్ కనిపిస్తున్నాయి. ట్వీట్స్, ట్రోలింగ్ వరకే ఉంటే.. బాగానే ఉంటుంది. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు చేయి దాటిపోయింది. అరే.. నలుగురు చూస్తారు. పది మంది చదువుతారనే ఇంగీతం లేకుండా దారుణంగా పచ్చి బూతు పురాణాలు ప్రారంభించారు. అల్లు ఫ్యాన్స్.. పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ లను ట్రోల్స్ చేస్తుంటే.. మేమైనా తక్కువనా అన్నట్టు మెగా ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో అల్లు Vs మెగా పేరిట ఓ మినీ కురుక్షేత్రం జరుగుతుందనే చెప్పాలి. ఇప్పటికే మూడు పంచులు.. ఆరు ట్రోల్స్ గా సాగుతున్న ఈ వివాదంలోకి హాట్ బ్యూటీ, కాంట్రవర్సీకి కేరాఫ్ హీరోయిన్ పూనమ్ కౌర్ ఎంటర్ అయింది.

వాస్తవానికి ఈ వివాదంతో నటి పూనమ్ కౌర్ కి ఎలాంటి సంబంధం లేదు. ఎంటర్ కావాల్సిన అవసరం లేదు. గట్టిగా మాట్లాడితే.. ఆమె అసలు మ్యారేంటో కూడా తెలిసి ఉండదు. అలాంటి పూనమ్.. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌లపై కౌంటర్లు వేస్తుంటుంది. ఈ విషయాన్ని గమినించి పవన్ ఫ్యాన్స్.. తగ్గేదేలే అన్నట్టుగా ఓ రేంజ్‌లో ఈ బ్యూటీ పై ట్రోల్ చేస్తుంటారు. సరేలే.. మనకు అవసరమా అని సైలెంట్ కాకుండా .. అల్లు వర్సెస్ మెగా వివాదంలోకి ఎంటరయ్యింది. కాంట్రవర్సీ వేళ ఓ సంచలన ట్వీట్ పెట్టింది పూనమ్. అగ్నికి ఆజ్యం పోయినట్టు.. అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలతో పాటు తాను ప్రార్థన చేస్తున్నట్టు ఓ ఫొటోను పోస్ట్ చేసింది ఈ అమ్మడు. పైగా.. ఆ ఫోటోకు ప్రేమ, ప్రార్థన, సామరస్యం అంటూ క్యాప్షన్ పెట్టింది. అలానే "లవ్ ఈజ్ ది ఆన్సర్" అనే హ్యాష్ ట్యాగ్ పెట్టింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ వివాదంలో అల్లు అర్జున్ కు ఇండైరెక్ట్ గా సపోర్టు ఇస్తూ.. మెగా ఫ్యామిలీని తక్కువ చేస్తుందని మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీకి కాకుండా ఇండైరెక్ట్‌గా అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక బన్నీ బాబుకు సపోర్టు దొరికిందంటూ.. అల్లు ఫ్యాన్స్ ఈ పోస్టును తెగ ర్వీట్వీట్ చేస్తూ.. వైరల్ చేస్తున్నారు. చిరు, పవన్ కళ్యాణ్ తో సహా మెగా హీరోలపై కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











