Poonam Kaur: నేను తెలంగాణ బిడ్డనే.. మతం పేరుతో వేరు చేయొద్దు.. ఏడ్చేసిన హీరోయిన్
ఆర్గానికి మామా హైబ్రిడ్ అల్లుడ్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పూనమ్ కౌర్. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హైదరాబాద్ బ్యూటీ ఒక విచిత్రం, నిక్కీ అండ్ నీరజ్, గణేష్, వినాయకుడు, శ్రీనివాస కల్యాణం వంటి తదితర చిత్రాల్లో నటించింది.
ఈ మధ్య తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించిని ఈ బ్యూటి పలు సామాజిక అంశాలపై గొత్తెతత్తుంది. ఈ క్రమంలో విమర్శల పాలవుతుంది. ఇటీవల తనకు అరుదైన వ్యాధి వచ్చినట్లు చెప్పిన ఈ గ్లామరస్ బ్యూటీ తాజాగా తనను మతం, మైనారిటీ పేరు చెప్పి వేరు చేయొద్దని వేడుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో..
పంజాబీకి చెందిన సరబ్ జిత్ సింగ్, నిజామాబాద్ కు చెందిన సుఖ్ ప్రీత్ దంపతులకు హైదరాబాద్ లో జన్మించింది ముద్దుగుమ్మ పూనమ్ కౌర్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివిన పూనమ్ కౌర్ ఆ తర్వాత ఢిల్లీలోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసింది.
ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి 2005లో మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకుంది. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు వచ్చాయి.

మాయజాలం సినిమాతో..
మోడలింగ్ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పూనమ్ కౌర్ 2006లో మాయాజాలం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమాను తెలుగులో మంచి దర్శకుడిగా పేరు ఉన్న ఎస్వీ కృష్ణా రెడ్డిదర్శకత్వం వహించారు.
ఇందులో తనదైన నటన, క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంది ఈ బ్యూటి. అనంతరం తెలుగు, తమిళ్, హిందీ మూడు భాషల్లో కలిపి సుమారుగా 24 సినిమాల్లో నటించింది. అందులో ఒక విచిత్రం, నిక్కీ అండ్ నీరజ్, వినాయకుడు, నాగవల్లి, పయనం, గగనం వంటి అనేక చిత్రాల్లో నటించింది.

సోషల్ మీడియాలో..
ముద్దుమ్మ పూనమ్ కౌర్ హీరోయిన్ గానే కాకుండా పలు సపోర్టింగ్ రోల్స్ కూడా చేసి అలరించింది. ఇందులో భాగంగానే గోపీచంద్ సూపర్ హిట్ మూవీ శౌర్యంలో అతనికి చెల్లెలుగా యాక్ట్ చేసి ఆకట్టుకుంది. చివరిగా 2018లో 3 దేవ్ అనే హిందీ చిత్రంలో రాధ పాత్ర పోషించింది. అయితే సినిమాలతో ఎక్కువగా పాపులారిటీ పొందని పూనమ్ కౌర్ సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. పలు విషయాలపై, అంశాలపై తన ట్విటర్, ఇన్ స్టా అకౌంట్స్ ద్వారా స్పందిస్తూ హైలెట్ అయింది.

నెటిజన్ల విమర్శలు..
ఇటీవల పూనమ్ కౌర్ అరుదైన వ్యాధి అయిన 'ఫిబ్రో మయాల్జియా' (Fibromyalgia)తో బాధపడుతున్నట్లు తెలిపింది. రెండేళ్లుగా ఇబ్బంది పడుతున్న ఆ వ్యాధి నుంచి బయటపడేందుకు కేరళలో చికిత్స తీసుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో పూనమ్ కౌర్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్య మెడికో ప్రీతి మరణించకుముందే ఆమె చనిపోయినట్లు ట్వీట్ చేసింది పూనమ్. దీంతో ఆమెపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు.

మహిళా దినోత్సవ వేడుకల్లో..
తాజాగా తెలంగాణలో కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేసింది బ్యూటిఫుల్ పూనమ్ కౌర్. అయితే ఆమె వ్యాఖ్యల్లో మతం ప్రస్తావన తీసుకురావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సోమవారం అంటే మార్చి 6న రాజ్ భవన్ లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ కూడా పాల్గొంది. ఈ వేదిక సందర్భంగా మతం, మైనారిటీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
సిక్కు అమ్మాయినని చెప్పి..
"నేను తెలంగాణలో పుట్టి పెరిగిన అమ్మాయిని. అయితే నా మతం పేరు చెప్పి నన్ను తెలంగాణ నుంచి వేరు చేస్తున్నారు. నేను పంజాబీ అమ్మాయినని ఎప్పుడూ చెబుతుంటారు. నేను ఇక్కడే పుట్టాను. పెరిగాను. నా మతం నన్ను నా రాష్ట్రం నుంచి వేరు చేయదు. మీ అందరిలాగానే నేను తెలంగాణ బిడ్డని. నేను మైనారిటీ సిక్కు అమ్మాయినని చెప్పి వేరు చేస్తున్నారు.
ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు. ఇండస్ట్రీలో నాకు పనిచేయాలని ఉంది. మీకు నచ్చిన బాంబే నుండి వచ్చిన వాళ్లకే అవకాశాలు ఇస్తున్నారు" అని స్టేజీపై మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది పూనమ్ కౌర్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా ఈ విషయం చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











