Poonam Kaur: బాలకృష్ణ అల్లుడిపై పూనమ్ కౌర్ షాకింగ్ కామెంట్లు.. ఆ విషయంలో భరత్ తోపు అంటూ!
పూనమ్ కౌర్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ సినీ నటిగానే కాకుండా మోడల్ గానూ రాణించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ చిత్రాలు చేసిన ఈమె ప్రస్తుతం సినిమాలకు దూరం అయింది. కానీ సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడూ వివాదాస్పద కామెంట్లు చేస్తోంది. ముఖ్యంగా హీరో పవన్ కల్యాణ్ పై ఎప్పుడూ విరుచుకు పడే ఈమె తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్ పై స్పందించింది. ఎక్స్ వేదికగా ఆయనపై షాకింగ్ కామెంట్లు చేసింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2006లో మాయాజాలం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. ముఖ్యంగా తన అందం, అభినయంతో అనేక మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈమె తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ చిత్రాలు చేసింది. అయితే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె సోషల్ మీడియా వేదికగా మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు పలు విషయాలపై స్పందిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసేది.

అంతేతాకుండా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తూ.. రచ్చ చేస్తుంటుంది. ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈ ముద్దుగుమ్మ ఇటీవలే గుంటూరు కారం సినిమాపై కామెంట్లు చేసింది. అంతేకాకుండా ఏపీ రాజకీయాలపై కూడా కామెంట్లు చేస్తూనే వస్తోంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ను ఉత్తర్ ప్రదేశ్ తో కూడా పోల్చింది. ఏపీ ఇస్ న్యూ యూపీ అంటూ ట్వీట్ చేసింది. ఇది వైరల్ అయి సెన్సేషన్ క్రియేట్ చేస్తుండగానే.. మరో షాకింగ్ పోస్ట్ పెట్టింది. ముఖ్యంగా నటసింహం నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు భరత్ పై ఓ ట్వీట్ చేసింది. అందులో షాకింగ్ కామెంట్లు చేసింది.
అందులో MMVS మనవడు, నటుడు బాలకృష్ణ అల్లుడు అయిన భరత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారని చెప్పుకొచ్చింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరఫు నుంచి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్న ఈయన ఈసారి ఏదో సాధించేలా కనిపిస్తున్నారని కామెంట్లు చేసింది. అయితే భరత్ గెలిచి ఇక్కడి నుంచి ఎంపీగా వెళ్తే చాలా బాగుంటుందని చెప్పుకొచ్చింది. ఫ్యూచర్ ఎడ్యుకేషన్ గురించి భరత్ కు ఉన్న విజన్ పై తనకు పూర్తిగా నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది.

అయితే ఇది ఎవరూ డబ్బులు ఇచ్చి తనతో ప్రచారం చేయింట్లేరని.. తానే ఇష్టంతో ఈ పోస్టు పెట్టినట్లు చెప్పింది. అలాగే దీన్ని ఎవరూ నెగిటివ్ గా తీసుకోకూడదని.. అందరూ భరత్ కు సపోర్ట్ చేయాలని కోరింది. ప్రస్తుతం పూనమ్ కౌర్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓసారి ఈమె చేసిన ఈ ట్వీట్ ను చూసి.. ఏమనిపిస్తుందో కామెంట్ చేసేయండి.


Click it and Unblock the Notifications











