twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటి వారిలోనే ప్రేమ, వైరాగ్యం.. పీకే లవ్ అంటూ పూనమ్ ట్వీట్.. అయోమయంలో నెటిజన్స్

    |

    కావాల్సినంత అందం ఉన్నా.. అదృష్టం అంతగా లేని భామ పూనమ్ కౌర్. హీరోయిన్ మెటీరియల్ అయినా కూడా ఆ రేంజ్ అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. అడపాదడపా చిత్రాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు కానీ పవన్ కళ్యాణ్ వ్యవహారంలోకి పూనమ్ ఎంటరైనప్పటి నుంచి ఓ వెలుగు వెలిగింది. పవన్-పూనమ్‌కు మధ్య ఏదో సంబంధం ఉందని కత్తి మహేష్ ఆరోపించడంతో ఆ వార్తలు సంచలనం సృష్టించాయి.

     ఆస్పత్రి బిల్స్, పూజలు..

    ఆస్పత్రి బిల్స్, పూజలు..

    పవన్ కళ్యాణ్‌కు, పూనమ్ కౌర్‌కు మధ్య ఎలాంటి సంబంధం లేకుండా ఆమె ఆస్పత్రి బిల్స్ పవన్ ఎందుకు కట్టారు? ఇద్దరూ కలిసి పూజలు ఎందుకు చేశారు? అని కత్తి మహేష్ ప్రశ్నలు విసిరారు. అయితే వాటికి ఇంత వరకు ఎలాంటి సమాధానాలు దొరకలేదు.

     పూనమ్ ఆడియో వైరల్..

    పూనమ్ ఆడియో వైరల్..

    అప్పట్లో పూనమ్ కౌర్ ఆడియో అంటూ తెగ హల్చల్ చేసింది. తాను త్రివిక్రమ్‌ను అన్నయ్య అని సంబోధిస్తానని అందులో పేర్కొంది. అయితే పేరు మాత్రం చెప్పకుండా కొన్ని విషయాలను వెల్లడించింది. పద్దతి గల అమ్మాయిని కాదా? నన్ను ఎందుకు మోసం చేశారంటూ ఓ ఆడియో ఫైల్ వైరల్ అయింది.

    అర్థంకానీ ట్వీట్లతో..

    పూనమ్ కౌర్ అర్థం కాని ట్వీట్లతో అందర్నీ అయోమయానికి గురి చేస్తుంది. ట్వీట్ చేసిన ప్రతీసారి ఏదో ఒక వివాదం రగులుతూనే ఉంటుంది. తీరా ఆ ట్వీట్ తాను చేయలేదని బుకాయిస్తుంది. చేసిన ట్వీట్ పరిశీలిస్తే అవి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించినట్టే ఉంటాయి. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ మళ్లీ నెటిజన్ల మెదడుకు మేత పెట్టింది.

    అలాంటి వారికే ప్రేమ, వైరాగ్యం..

    అలాంటి వారికే ప్రేమ, వైరాగ్యం..

    తాను ఓ కవిత రాశానని, దాన్ని తన స్నేహితుడు తెలుగులోకి అనువదించాడని చెబుతూ..‘డబ్బు హోదా ఉన్నవాడు రాజు అవ్వొచ్చు కానీ ప్రేమ త్యాగం న్యాయం కోసం పోరాడేవ్యక్తి వీరుడవుతాడు.. రాజులు శాసిస్తారు.. వీరులు మిమ్మల్నికాపాడుతారు.. శాసించాలి అని తపనవాడికి అహంకారం ఉంటుంది.. అందరూ బాగుండాలనుకునే వ్యక్తులలో ప్రేమ, వైరాగ్యం ఉంటుంద'ని పీకే లవ్, జై హింద్ అనే హ్యాష్ ట్యాగ్‌లతో పోస్ట్ చేసింది.

    Recommended Video

    Hilarious Meme On Vijay Devarakonda Ananya Panday Viral Pic
     అయోమయంలో నెటిజన్స్..

    అయోమయంలో నెటిజన్స్..

    అయితే పీకే అంటే పవన్ కళ్యాణేనా? అని కొందరు ఆ మాటలు పవన్ కళ్యాణ్‌కే సూట్ అవుతాయని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఇలా అర్థం కాకుండా ట్వీట్స్ పెట్టడంలో పూనమ్ పీహెచ్‌డీ చేసినట్టుంది.

    English summary
    Poonam Kaur Tweet Creates Confusion In Netzens. She Wrote A Poem And it looks Like For Pawan Kalyan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X