ఆవేశం ‘పవర్’ అనుకొంటే తప్పు.. పూనమ్ కౌర్ ట్వీట్.. షాకిచ్చిన నెటిజన్
సినీ నటి పూనమ్ కౌర్ సినిమాలకు దూరంగా ఉంటూ.. ప్రస్తుతం సామాజిక పరిస్థితులపై స్పందిస్తున్నారు. సోషల్ మీడియాను ఆసరగా చేసుకొని పరోక్షంగా రాజకీయ నాయకుడిగా మారిన సినీ నటుడిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో కనిపిస్తున్నారు. అయితే ఆ వ్యాఖ్యలు జనసేన నేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించినవేననే మాట వినిపిస్తున్నది. అయితే తాజాగా ట్విట్టర్‌లో పూనమ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వివరాల్లోకి వెళితే..
నటి పూనమ్ కౌర్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఆవేశం ఎప్పటికి పవర్ కాదు అంటూ ట్వీట్ చేశారు. దాంతో నెటిజన్లు రంగంలోకి దిగారు. మీరు ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారో మాకు తెలుసు. నర్మగర్భంగా మీరు చేస్తున్న ట్వీట్లు అర్ధం చేసుకొలేమా అంటూ కొందరు కామెంట్లు విసిరారు.

పూనమ్ కౌర్ వ్యాఖ్యలపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఒకే ఆవేశం పవర్ కాదని మీరు అనుకొన్నది కరెక్టే అయితే.. మరి భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, ప్రకాశం పంతులు వారి ఆవేశంలో పవర్ లేదా? ఆవేశం ఉన్న వ్యక్తులు మంచి మానవత్వం ఉన్న వ్యక్తులు అని ఒకరు కౌంటర్ ఇచ్చారు.
నెటిజన్ చేసిన కౌంటర్‌కు సమాధానం ఇస్తూ.. వారి ఆవేశానికి ఓ లక్ష్యం ఉంది. వారి ఆవేశం వెనుక ద్వంద ప్రమాణాలు లేవు. రాజకీయ హోదా కోసం వారు పోరాటం చేయలేదు. వారు పోరాటం చేసి అందరి స్వేచ్ఛ కోసం అంటూ పూనమ్ కౌర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











