అఖండ, బ్యాక్‌ డోర్ చిత్రాలతో పూర్ణ జోరు.. డిసెంబర్‌లో సినిమాలతో హల్‌చల్

దక్షిణాదిలో నటిగానే కాకుండా మంచి డ్యాన్సర్‌గా పేరు సంపాదించుకొన్న గ్లామర్ హీరోయిన్ పూర్ణ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆమె నటించిన 3 రోజెస్ చిత్రంలో కీలక పాత్రతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక బాలకృష్ణ నటించిన అఖండలో, అలాగే విభిన్నమైన కథతో వస్తున్న బ్యాక్ డోర్ చిత్రంలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..

Poorna alias Shamna Kasims Back Door and Akhanda to release in December.

పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన క్రేజీ ఎంటర్టైనర్ 'బ్యాక్ డోర్' డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ క్రేజీ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు "కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్" అధినేత- ప్రముఖ డిస్ట్రిబ్యూటర్-నిర్మాత కందల కృష్ణారెడ్డి సొంతం చేసుకున్నారు.

బ్యాక్ డోర్ చిత్రం విడుదలను పురస్కరించుకుని హైదరాబాద్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్సులు ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, ప్రముఖ నిర్మాత ఆచంట గోపినాధ్, రావణలంక కథానాయకుడు క్రిష్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. "బ్యాక్ డోర్" చిత్రం థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్న కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి, చిత్ర దర్శకుడు కర్రి బాలాజీ, కథానాయకుడు తేజ త్రిపురాన పాలుపంచుకున్నారు.

Poorna alias Shamna Kasims Back Door and Akhanda to release in December.

కేఆర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ..."బ్యాక్ డోర్" చిత్రానికి గల క్రేజ్ కి తగ్గట్టు... భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3న విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం హక్కుల కోసం పలువురు పోటీ పడినప్పటికీ... నా మీద నమ్మకముంచిన "బ్యాక్ డోర్" నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి, దర్శకుడు కర్రి బాలాజీలకు థాంక్స్ తెలియజేస్తున్నాను. దర్శకుడిగా ఈ చిత్రం బాలాజీకి చాలా మంచి పేరు తీసుకురావడం ఖాయం" అన్నారు.

అఖండ చిత్రంలో మంచి పాత్ర పోషించిన పూర్ణ నటించిన బ్యాక్ డోర్ చిత్రం అఖండతోపాటు విడుదలవుతుండడం నిర్మాతలకు కలిసివచ్చే అంశం. అలాగే... బ్యాక్ డోర్ చిత్రాన్ని విడుదల చేస్తున్న నెల్లూరు కృష్ణారెడ్డి... బాలయ్యకు వీరాభిమాని కావడం విశేషం. బ్యాక్ డోర్ కూడా అఖండ ఆదరణ పొందడం ఖాయమని అతిధులు ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కర్రి బాలాజితో ఆనందభైరవి చిత్రాన్ని నిర్మిస్తున్న బి.తిరుపతిరెడ్డి, లాంప్ చిత్రం నిర్మిస్తున్న జనార్దన్ రెడ్డి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ రఘు, ఈ చిత్రం ప్రొడక్షన్ డిజైనర్. విజయ.ఎల్.కోట, పబ్లిసిటీ డిజైనర్ విక్రమ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ
పబ్లిసిటీ డిజైనర్: విక్రమ్ రమేష్
కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ
పాటలు: నిర్మల- చాందిని
సంగీతం: ప్రణవ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్
ఆర్ట్: నాని
ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్
కెమెరా: శ్రీకాంత్ నారోజ్
ప్రొడక్షన్ డిజైనర్: విజయ ఎల్.కోట
పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ
కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను
రిలీజ్: కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్
నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి
రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X