హీరోయిన్ పూర్ణకు బ్లాక్‌మెయిల్.. నిందితులకు బెయిల్
తెలుగు, తమిళ, మలయాళ నటి పూర్ణ అలియాస్ షమ్నా ఖాసింకు ఎదురైన వేధింపులు, బ్లాక్ మెయిల్ కేసులో నిందితులకు ఎర్నాకులం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తన కూతురు, యాక్టర్ పూర్ణను కొందరు వేధిస్తున్నారు. ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సొమ్ము ఇవ్వకపోతే అంతు చూస్తామని బెదిరించారు అని కేరళలోని మరదు పోలీస్ స్టేషన్‌లో తల్లి ఫిర్యాదు చేయడంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడం దక్షిణాది సినీ పరిశ్రమలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
లక్షలాది రూపాయలను డిమాండ్ చేస్తూ కొద్ది రోజుల క్రితం హీరోయిన్ పూర్ణను బెదిరించారు. డబ్బు ముట్ట చెప్పకపోతే అంతు చూస్తామని, కెరీర్ నాశనం చేస్తామని హెచ్చరించడం మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసి విచారించారు.

హీరోయిన్ పూర్ణ బ్లాక్ మెయిల్ కేసులో నిందితులు శరత్; అబూబాకర్, హ్యారీస్‌కు ఎర్నాకులం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే వారిని రెండు వారాల్లో విచారణ కోసం అధికారుల ముందు హాజరుకావాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.
తెలుగులో శ్రీ మహాలక్ష్మి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన పూర్ణ ఆ తర్వాత సీమ టపాకాయ్, అవును, లడ్డుబాబు, అవును 2, అవంతిక, రాక్షసి, సిల్లీ ఫెలోస్, సువర్ణ సుందరి చిత్రాల్లో నటించారు. తాజాగా తెలుగు, తమిళంలో రూపొందుతున్న తలైవి చిత్రంలో శశికళ పాత్రలో కనిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











