Dasara: నాని దసరా మూవీలో లేడీ విలన్.. సర్‌ప్రైజ్ చేయనున్న హీరోయిన్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. సహజ సిద్ధమైన నటనతో ప్రతి సినిమానూ వన్ మ్యాన్ షోగా మార్చేస్తోన్న అతడు.. ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు. అయితే, 'జెర్సీ' తర్వాత ఆ రేంజ్ సక్సెస్‌ను అందుకోవడం కోసం వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఆ మూవీ తర్వాత అతడు చేసిన 'గ్యాంగ్ లీడర్' ప్రేక్షకుల మెప్పును పొందలేకపోయింది. ఆ తర్వాత 'వీ', 'టక్ జగదీష్' వంటి సినిమాలు చేసినా.. అవి ఓటీటీల్లోనే నేరుగా విడుదల అయ్యాయి. దీంతో నానితో పాటు అతడి అభిమానులు కూడా తీవ్ర నిరాశను ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీతో ఈ స్టార్ హీరో విజయాన్ని అందుకున్నాడు.

ఇటీవలే నేచురల్ స్టార్ నాని 'అంటే.. సుందరానికీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేచురల్ స్టార్ నాని.. ఈ చిత్రంతో ప్రతికూల ఫలితాన్ని అందుకున్నాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు దాదాపు పది కోట్ల రూపాయల వరకూ నష్టాలు వచ్చాయి. అయినప్పటికీ నాని ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ స్టార్ హీరో 'దసరా' అనే సినిమాను చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ మూవీ తెలంగాణ పల్లెటూరి నేపథ్యంతో రాబోతుంది. ఈ మూవీ ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.

Poorna Negative Role in Nani Dasara Movie

విభిన్నమైన సబ్జెక్టుతో రాబోతున్న 'దసరా' మూవీ షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభం అయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నారు. మరీ ముఖ్యంగా సింగరేణి బొగ్గు గనుల్లోనే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతోన్న భారీ షెడ్యూల్‌లో పలు కీలకమైన సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా షూట్ చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే దీన్ని పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా జరపాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'దసరా' మూవీలో నాని పవర్‌ఫుల్ మాస్ పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే అతడి రోల్‌కు సంబంధించిన లుక్స్‌ను కూడా రివీల్ చేశారు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో లేడీ విలన్ పాత్ర హైలైట్‌గా ఉండబోతుందని తెలిసింది. ఈ రోల్‌ను టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ అలియాస్ సామ్నా కాశీం చేస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా చాలా వరకూ పూర్తైందని అంటున్నారు. ఇక, ఈ విషయాన్ని పూర్ణ కూడా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. దీంతో ఈ రోల్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది.

మాస్ కథతో రూపొందుతోన్న 'దసరా' మూవీని శ్రీకాంత్ ఓదెల అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ దీనికి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నాడు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X