పంది పిల్లతో కలిసి హీరోయిన్ పూర్ణ స్పెషల్ సాంగ్
రవిబాబు నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా అదుగో. ఈ సినిమాలో పంది పిల్ల కీలకపాత్రలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్లో ఇందులో నటించిన పిగ్ లెట్(పంది పిల్ల) బంటిని పరిచయం చేశారు.
తాజా సమాచారం ప్రకారం... ఈ చిత్రంలో హీరోయిన్ పూర్ణ స్పెషల్ సాంగులో దర్శనమివ్వబోతోంది. ఈ పాటను సోమవారం (సెప్టెంబర్ 17) విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది సినిమా టైటిల్ సాంగ్ అని, ఇందులో పూర్ణతో పాటు పందిపిల్ల బంటీ కూడా కనిపిస్తుందని చిత్ర యూనిట్ తెలిపారు. ఆ పాట ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌లా ఉంటుందని వెల్లడించారు.

'అదుగో'లో రవిబాబుతో పాటు ఈ చిత్రంలో అభిషేక్ వర్మ, నభా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్ ను చూపిస్తోన్న సినిమా ఇది. ఇందులో పందిపిల్లను చాలా రియల్ గా చూపించే ప్రయత్నం చేశారట. కుటుంబ ప్రేక్షకులను.. ముఖ్యంగా పిల్లలను బాగా ఆకట్టుకునే కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దీన్ని తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ తెలిపారు.
ఏ ఫ్లైయింగ్ ఫ్రాగ్ బ్యానర్ లో రవిబాబు.. సురేష్ ప్రొడక్షన్ సంస్థ అధినేత సురేష్ బాబు సమర్పణలో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తుండగా.. ఎన్ సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అదుగో చిత్రాన్ని అన్ని భారతీయ భాషల్లో విడుదల చేయబోతుండటం మరో విశేషం. తెలుగులో 'అదుగో' అనే టైటిల్‌తో, ఇతర భాషల్లో బంటి పేరుతో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











