షూటింగ్ లో ప్రమాదం.. ప్రముఖ నటుడు నాజర్ కు గాయాలు!
సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపున అందుకున్న నాజర్ ఇటీవల షూటింగ్ లో ప్రమాదానికి గురైయినట్లుగా తెలుస్తోంది. ఒక పోలీస్ అకాడమీ లో ఆయన షూటింగ్ చేస్తుండగా అనుకోకుండా ఆయన వేగంగా కదులుతున్న సమయంలో జారీ కింద పడినట్లుగా సమాచారం. కొంత గాయపడడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లారు. పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని వైద్యులు కూడా తెలియజేసినట్లు సమాచారం.
ఇక నటుడు నాజర్ గురించి ప్రత్యేకంగా చెప్పనాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళం మలయాళం కన్నడ ఇండస్ట్రీలోనే కాకుండా హిందీ ఇండస్ట్రీలో కూడా ఆయన చాలా సినిమాల్లో నటించారు. నటుడిగా ఆయన ఎన్నో రకాల విభిన్నమైన పాత్రలను పోషించారు. ఇక ఇటీవల హఠాత్తుగా గాయపడడంతో ఆయనకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఆ విషయంలో రూమర్స్ పెద్దగా వైరల్ అవ్వకముందే చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

తెలంగాణ పోలీస్ ఎకాడమీ లో షూటింగ్ సమయంలో నటుడు నాజర్ కు గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఒక తమిళ సినిమా షూటింగ్లో భాగంగా ఆయనతోపాటు నటి సుహాసిని హీరోయిన్ మెహ్రీన్ అలాగే షియాజి షిండే కూడా ఆ షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఒక సీరియస్ సన్నివేశంలో మెట్లపై నుంచి దిగి రావాల్సి ఉండగా ఆయన చకచకా వస్తూ ఉండడంతో అనుకోకుండా కాలు స్లిప్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక మైనర్ ఇంజ్యురి కారణంగా వెంటనే షూటింగ్ కి బ్రేక్ ఇచ్చేసి చిత్ర యూనియ్ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అని ఆయన కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ యధావిధిగా షూటింగ్లో పాల్గొనవచ్చు అని కూడా వైద్యులు సలహా ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు నాజర్ తమిళంలోనే కాకుండా కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించబోతున్నారు.


Click it and Unblock the Notifications











