Don't Miss!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- News పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల్లో నిమ్ము- అభిమానులకు జనసేన కీలక సూచన..!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మతాన్ని పక్కనపెట్టి గణేష్ పండుగ విషెస్.. ఎంపీ నుస్రత్ను టార్గెట్ చేసిన నెటిజన్లు
పాపులర్ బెంగాల్ యాక్టర్, పార్లమెంట్ సభ్యురాలు నుస్రత్ జహాన్ మతానికి సంబంధించిన భావాలను పక్కన పెట్టి గణేష్ చతుర్థి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం మరోసారి చర్చకు దారి తీసింది. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలీవుడ్, ఇతర సినీ ప్రముఖులతోపాటు నుస్రత్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. తన అభిమానులకు, నియోజకవర్గ ప్రజలకు ఆమె గణేష్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపింది.
గణేష్ భగవానుడు అందరికి మంచి ఆరోగ్యం, సుఖ: సంతోషాలను అందజేయాలని కోరుకొంటున్నాను. అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి. గణపతిపప్పా మోరియా అంటూ విషెస్ అందజేశారు. మతానికి అతీతంగా నుస్రత్ విషెస్ తెలియజేయడంపై కొందరు నెటిజన్లు ఆమెను ప్రశంసించారు. బదులుగా హ్యాపీ గణేష్ చతుర్థి అంటూ సందేశాలు పంపారు. అయితే కొందరు మాత్రం ఆమె తీరును తప్పటం జరిగింది.
ఇదిలా ఉండగా, తృణమూల్ పార్టీ ఎంపీగా ఎన్నికైన తర్వాత నిఖిల్ జైన్ అనే పారిశ్రామిక వేత్తను జూన్ 19న వివాహం చేసుకొన్నారు. అయితే పెళ్లి కోసం ఎంపీగా ప్రమాణస్వీకారం వాయిదా వేసుకోవడం, ఆ తర్వాత ముస్లిం అయి ఉండి కూడా నుదుట సింధూరం పెట్టుకొంటావా? అని నెటిజన్లు ట్రోల్ చేశారు.
నెటిజన్ల ట్రోల్ చేయడంపై నుస్రత్ ఘాటుగా స్పందించారు. నేను ఇంకా ముస్లింనే. కానీ అన్ని మతాలను గౌరవిస్తాను. నేను ధరించాలో అనేది నా వ్యక్తిగత విషయం. ధరించే దుస్తులను బట్టి మత భావాలను అంచనా వేయడం సరికాదు అని ఆమె అన్నారు.