పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శ్రేయా ఘోషల్.. ఇలా మునుపెన్నడూ లేదంటూ ఎమోషనల్ నోట్!

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పాపులర్‌ అయిన సింగర్‌ శ్రేయా ఘోషల్‌ తన అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ మధ్యనే తమ ఇంట్లోకి త్వరలో మూడో వ్యక్తి రాబోతున్నారని ప్రకటించిన ఆమె తాజాగా తల్లయింది. ఆమె శనివారం(22 మే) నాడు పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని శ్రేయా స్వయంగా తన సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ అంశం మీద ఆమె స్పందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్టు షేర్‌ చేశారు.

అంతే కాక ఒక ఎమోషనల్ నోట్ కూడా షేర్ చేసింది. 'ఈ మధ్యాహ్నం మాకు మగ బిడ్డ పుట్టాడు. ఇలాంటి అనుభూతిని గతంలో ఎప్పుడు నేను పొందలేదు. ప్రస్తుతం నేను, శిలాదిత్య(ఆమె భర్త), నా కుటుంబం మొత్తం సంతోషంలో మునిగితేలుతున్నాం' అంటూ ఆమె ఈ విషయాన్ని తన ఫాలోవర్స్ తో పంచుకున్నారు. అలాగే తన బిడ్డకు మీరందరు ఇచ్చే లెక్కలేనన్ని ఆశ్వీర్వాదాలకు ధన్యవాదాలు అంటూ ఆమె పోస్ట్ లో రాసుకొచ్చారు. స్టార్ సింగర్‌గా రాణిస్తున్న శ్రేయా ఘోషల్‌ సింగర్‌గా నాలుగు జాతీయ అవార్డులందుకున్నారు.

 Popular playback singer Shreya Ghoshal gives birth to baby boy

వెస్ట్ బెంగాల్‌ కి చెందిన ఈ బ్యూటిఫుల్ సింగర్‌ బిజినెస్‌ మ్యాన్‌ అయిన శిలాదిత్యని 2015లో వివాహం చేసుకుంది. మొత్తానికి ఆరేళ్ల తర్వాత వారి జీవితంలోకి మూడో వ్యక్తి వచ్చి చేరారు. ఆమె ఈ మధ్య సూపర్ హిట్ అయినఉప్పెన చిత్రంలో జల జల జలపాతమ్‌.. అనే పాటను ఆలపించారు. అలాగే రిలీజ్ కావాల్సి ఉన్న టక్‌ జగదీష్‌లో ఇంకోసారి.. ఇంకోసారి అనే పాటను సైతం ఆలపించారు. టాలీవుడ్.. బాలీవుడ్‌.. మాలీవుడ్‌.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, మలయాళం, అస్సామీ ఇలా ఎక్కడ అవకాశం వచ్చినా కాదనుకుండా తన అద్భుత గానంతో అలరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X