ప్రముఖ గాయని కన్నుమూత.. ప్రధాని మోదీ దిగ్బ్రాంతి.. మృతికి కారణం ఏమిటో తెలుసా?
ప్రముఖ గాయని శారద సిన్హా ఇకలేరు. గత కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న టాలెంటెడ్ సింగర్ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో సంగీత ప్రపంచం మూగబోయింది. శారద మృతితో సినీ, రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆమె మరణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ప్రముఖ గాయని శారద ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించారు. ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు ఎయిమ్స్‌లో మెరుగైన చికిత్సను అందించారు. ఆమె ప్రాణాలను కాపాడేందుకు మోదీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు.

శారద వయసు 72 సంవత్సరాలు. ఆమె బిహార్‌లోని హులాస్‌లో 1952 అక్టోబర్ 1వ తేదీన జన్మించారు. ఆమె బ్రజ్ కిషోర్‌ను వివాహం చేసుకొన్నారు. ఆమెకు కూతురు వందన, అన్షుమాన్ సిన్హా ఉన్నారు. అయితే కొద్దికాలంగా వృద్దాప్య సంబంధిత వ్యాధితో, అలాగే బ్లాడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
భారతీయ జానపద సంగీతానికి విశేషంగా సేవలు చేసిన శారద సిన్హాకు కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పించింది. ఆమకు దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ అవార్డును 2018 సంవత్సరంలో అందజేశారు. ఆమె జాతీయ ఉత్తమ గాయని అవార్డు కూడా అందుకొన్నారు. ప్రాంతీయ భాషలో మ్యూజిక్ రంగానికి విశేషంగా సేవలు అందించారు.


Click it and Unblock the Notifications











