తప్పు చేస్తేనే.. పోసాని అరెస్ట్‌పై భార్య సంచలన వ్యాఖ్యలు

నటుడు, నిర్మాత, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళీ అరెస్ట్ వార్త సినీ వర్గాలను, వైసీపీ కార్యకర్తలను దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయనను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకోన్నారనే వార్త ఆలస్యంగా బయటకు వచ్చింది. రాయచోటి, ఏపీలోని ఇతర ప్రాంతాల్లో ఆయనపై కేసులు నమోదు కావడం తెలిసిందే. ఈ కేసులో ఆయన నోటీసులు ఇవ్వకుండా.. బలవంతంగా లాక్కెళ్లారని ఆయన భార్య కుసుమలత ఆరోపించారు. పోసాని అరెస్ట్ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ..

బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బెల్ మోగింది. ఆ సమయంలో పోసాని స్వయంగా డోర్ తీశారు. వెంటనే నలుగురు పోలీసులు లోనికి వచ్చారు. అందులో ఇద్దరు పోలీస్ డ్రెస్‌లో ఉన్నారు. అయితే తమతో రావాలని వారి డిమాండ్ చేయడంతో.. నా ఆరోగ్యం సరిగా లేదు. నోటీసులు ఇచ్చి వెళ్లండి.. నేను రేపు వస్తాను అని అన్నారు. అయినా వారు వినలేదు. ఆయన ఎటు వెళితే.. అటు వచ్చి ఆయన వెంట ఉండి లాక్కెల్లారు అని పోసాని భార్య కుసుమలత మీడియాకు తెలిపారు.

Posani Krishna Murali arrest Wife Kusumalatha Reaction

పోసానితో ఎక్కువగా మాట్లాడనివ్వలేదు. ఆయన చుట్టే నలుగురు ఉన్నారు. ఆయనను అరెస్ట్ చేసే సమయంలో అతడి ఆరోగ్యం బాగాలేదని చెప్పాం. ఆయన గురువారం ఉదయం వైద్య పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంది. ఆయన కడుపునొప్పి, భుజం నొప్పితో బాధపడుతున్నారు. ఆయనను అరెస్ట్ చేయడం సరికాదు. కావాలంటే నోటీసులు ఇవ్వండి. మేము వాటికి స్పందిస్తామని చెప్పాం. అయినా వినకుండా ఆయనను అరెస్ట్ చేశారు అని వెల్లడించారు.

గత కొద్దికాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఇంటికే పరిమితమయ్యారు. సినిమా స్క్రిప్టులు రాసుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఆయనకు మందులు వేసుకోవడం కూడా తెలియదు. నేనే దగ్గరుండి ఆయనకు టాబ్లెట్లు ఇస్తాను. ఆ విషయం చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. కొన్ని మందులు వారి వెంట తీసుకెళ్లారు. ఇంకా కొన్ని మందులు ఇస్తానని చెబితే.. మా డాక్టర్ చూసుకొంటారని పోలీసులు చెప్పారని కుసుమలత తెలిపారు.

Posani Krishna Murali arrest Wife Kusumalatha Reaction

గత కొద్ది రోజుల క్రితం రాజకీయాలకు నాకు సంబంధం లేదు. వైసీపీకి రాజీనామా చేస్తున్నానని ప్రెస్ మీట్ చెప్పారు. అప్పటి నుంచి ఆయన పాలిటిక్స్ జోలికి వెళ్లడం లేదు. ఆయన ఏదైనా తప్పు చేస్తేనే గానీ ఆయన స్పందించారు. ఎవరైనా తన పట్ల తప్పుగా మాట్లాడితే ఊరుకోరు. కానీ ఈ విషయంలో ఆయన అరెస్ట్ చాలా బాధాకరం. ఆయన, నా వద్ద నుంచి ఫోన్లు లాగేసుకొన్నారు. మా కొడుకు ఫోన్ లాగేసుకోవడానికి ప్రయత్నిస్తే... దూరంగా వెళ్లారు అని ఆమె చెప్పారు.

More from Filmibeat

Read more about: posani krishna murali posani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X