దిల్ రాజు ప్లాప్, హిట్ అని చూసే నిర్మాత కాదు: ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంటులో పోసాని
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై హై రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చింది.
మే 9న ప్రపంచవ్యాప్తంగా 'మహర్షి' చిత్రం విడుదలువుతున్న నేపథ్యంలో బుధవారం(మే 1) నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన అశ్వినీదత్ మాట్లాడుతూ... ''అలనాటి 'అగ్ని పర్వతం' నుంచి ఘట్టమనేని కుటుంబంతో ఎన్నో హిట్ సినిమాలు తీశాను. మహేష్ బాబును 'రాజకుమారుడు' సినిమా ద్వారా పరచయం చేసి ఇపుడు ఈ 25వ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది. మే 1న ప్రీ రిలీజ్ ఈవెంట్, మే 9న సినిమా రిలీజ్ కావడం..... గతంలో నా సినిమాలు 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'మహానటి'కి ఇలానే జరిగింది. గతంలో అల్లు అరవింద్, రాఘవేంద్రరావుతో కలిసి సినిమాలు నిక్మించాను. ఈ రోజు యంగ్ అండ్ డైనమిక్ నిర్మాతలు దిల్ రాజు, పివిపిలతో కలిసి పని చేయడం గర్వంగా ఉంది. ఒకటి మాత్రం తప్పకుండా చెప్పగలను ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది.'' అన్నారు.

పోసాని మాట్లాడుతూ.... ''నేను కృష్ణగారి అభిమానిని. ఆయన్ను ఎంత ప్రేమిస్తానో మహేష్ బాబును అంతే ప్రేమిస్తాను. మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' సినిమా చేశాను, ఇపుడు 'మహర్షి'లో చేస్తున్నాను. దీని తర్వాత మహేష్ బాబు మూవీలో కూడా నాకు మంచి వేషం అనిల్ రావిపూడి ఇచ్చారు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి నిర్మాతలుండేవారు. రామానాయుడుగారు ఉన్నంతకాలం వాళ్ల బేనర్లో ఎంతో మంది డైరెక్టర్లను, ఆర్టిస్టులను, టెక్నీషియన్లను పరిచయం చేసి పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. ఆ తర్వాత త్రివిక్రమరావుగారు, అశ్వినీదత్ ఇలా పెద్ద నిర్మాతలు సేవ చేశారు. ఇపుడు దిల్ రాజు, వాళ్ల బ్రదర్ సిరీస్ గురించి చెప్పాలి. డైరెక్టర్ హిట్ సినిమా తీశాడా? ప్లాప్ సినిమా తీశాడా? అనే సంబంధం లేకుండా మంచి కథ తెస్తే అవకాశం ఇచ్చి ఎంతో మంది దర్శకులను, ఆర్టిస్టులను వెలుగులోకి తెచ్చిన బేనర్ వారిది. వారి సేవలు తెలుగు సినిమా పరిశ్రమలో కొనసాగాలని కోరుకుంటున్నాను.'' అన్నారు.


Click it and Unblock the Notifications











