‘ఆ పని చేస్తే చెప్పుతో కొట్టండి.. రోడ్డుపైన పడేయకండి’

వివాదాస్పద నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళీ మళ్లీ సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించిన ఆయన తాజాగా ఆపరేషన్ అరుణారెడ్డి అనే సినిమాను ప్రారంభించారు. ఈ చిత్రానికి రచన, నిర్మాణం, దర్శకత్వం పోసాని తన బాధ్యతల్ని నిర్వర్తించారు. అన్యాయం, అవినీతిపై ఓ జర్నలిస్టు సాగించిన పోరాటం నేపథ్యంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలో హిందోలా చక్రవర్తి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎంపీ రఘునందన్ రావు కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా గురించి పోసాని మాట్లాడుతూ..

ఆపరేషన్ అరుణారెడ్డి సినిమాకు రాజకీయాలకు సంబంధం లేదు. ఏ పార్టీకి, ఏ పార్టీ నేతకు సంబంధం లేని కథ. ప్రస్తుతం సమాజంలో చోటు చేసుకొంటున్న అన్యాయాలపై జర్నలిస్టు సాగించే పోరాటమే. ఈ చిత్రాన్ని అన్నీ పార్టీల వారు చూడొచ్చు. రాజకీయాలకు సంబంధం లేని కథ. రాజకీయ లబ్ది పొందాలని ఎంపీ రఘునందన్‌కు అవకాశం ఇవ్వలేదు. మా ఇద్దరి మధ్య స్నేహం కారణంగానే ఆయనకు ఆఫర్ ఇచ్చాను అని అన్నారు.

Posani Krishna Murali

రాజకీయాలకు దూరంగా ఉండి చాలా రోజుల తర్వాత సినిమా చేసుకొంటున్నాను. నన్ను రోడ్డున పడేయకండి అని నటుడు, రచయిత, దర్శక, నిర్మాత పోసాని కృష్ణ మురళి అన్నారు. ప్రజాసేవల చేయాలంటే.. సేవ చేయాలి. జైలుకు వెళ్లాలి. నాకు అవకాశం ఇస్తే మంచి సినిమా చేసుకొంటాను అని అన్నారు. నన్ను కొందరు జెంటిల్మన్ అంటారు. మరికొందరు డాబర్ మ్యాన్ (కుక్క) అంటారు. అది వారి వారి ఇష్టం అని పోసాని అన్నారు.

నన్ను అనవవరంగా తిడితే ఎక్కువగా రెస్పాండ్ అవుతాను. నేను తప్పుడు దారిలో ఒక్క రూపాయి సంపాదించినా.. రాంగ్ రూట్‌లో అవినీతి చేసినా..బ్రోకర్ పని చేసినా.. అన్యాయం తిట్టినా.. అకారణంగా ఫిట్టింగ్ పెట్టినట్టు తెలిస్తే.. నన్ను చెప్పుతో కొట్టండి. నన్ను ఎన్నోసార్లు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలిచాడు. ఎన్నో ఆఫర్లు ఇచ్చాడు. నేనే అవినీతికి పాల్పడాలనుకొంటే.. ఆయన్ను 5 ఎకరాలు భూమి తీసుకొని స్టూడియో కట్టుకొనే వాడిని అని పోసాని ఎమోషనల్ అయ్యారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ నాకు మంత్రి పదవి కావాలా? అని అడిగారు. కానీ నేను అంగీకరించలేదు. ఒకవేళ అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటే.. నేను మంత్రి పదవిని తీసుకొనే వాడిని. కావాలంటే ఈ విషయాన్ని మీరు స్వయంగా జగన్‌ను అడిగి తెలుసుకోండి అని పోసాని చెప్పారు.

నాకు వైఎస్ జగన్ అంటే ఇష్టం. సోనియా గాంధీని విభేదించిన తర్వాత నాకు అతనంటే ఇష్టం ఏర్పడింది. కానీ పార్టీలో సభ్యత్వం తీసుకోలేదు. కానీ నేను సేవ చేయడమే తెలుసు. చంద్రబాబు మంచి పనులు చేస్తే ఆయనకు సపోర్ట్ చేశా. చిరంజీవి పార్టీ పెట్టి పిలిస్తే వెళ్లి పోటీ చేశాను. ఎన్టీఆర్‌కు కూడా సపోర్ట్ చేశాను అని తెలిపారు. నాకు పైరవీలు చేయడం రాదు. నేను డబ్బు తినే వాడిని కాదు. బినామీలు చూసుకొనే వాడిని కాదు. ఏనాడైనా నేను అవినీతి చేసినట్టు నిరూపిస్తే ఈ రాష్ట్రం వదిలి పోతాను అని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X