నన్ను చంపడానికి కుట్ర చేశారా?.. వెన్నుపోటుదారుడ్ని కూడా కాదే.. పోసాని
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సినిమా తీస్తున్నట్టు ఎన్నికల కమిషన్‌కు టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేయడంపై రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీ ఘాటుగా స్పందించాడు. తాను అలాంటి చిత్రం తీయడం లేదని, ఓ సందేశాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు పోసాని క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. నాకు చంద్రబాబును దూషించే ఉద్దేశం లేదు అని అన్నారు.
ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటీసులపై క్లారిటీ ఇచ్చానని, ఆ తర్వాత కూడా మార్చి 20న ఈసీ ముందు హాజరకావాల్సిన పని నాకు లేదని పోసాని అన్నారు. కేవలం వైసీపీ మద్దతుదారుడిననే కారణంతోనే నోటీసులు ఇచ్చారా? సెక్రెటేరియట్‌కు వస్తే నన్ను చంపడానికి కుట్ర ఏమైనా చేశారా అనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.

నేను వెన్నుపోటుదారుడిని కాదు లేదా రౌడీషీటర్ కూడా కాదు అని పోసాని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా బ్రోకర్‌ను, లోఫర్‌ను కాదు.. నాపై ఒక్క కేసు కూడా లేదు. అలాంటి వాడికి ఇలా నోటీసులు ఇస్తారా? ఇదేమైనా న్యాయమా? అని పోసాని ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications











