మరోసారి ఆ ప్రయత్నం చేయబోతున్న పోసాని!
దర్శకుడిగా విజయాలను ఎక్కువగా అందుకోలేకపోయిన పోసాని కృష్ణ మురళి, నటుడిగా బిజీ అయ్యారు. కామెడీ టచ్ తో ఉండే నేటిటివ్ రోల్స్ కు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. చాలా చిత్రాల్లో పోసాని పోషించే పాత్రలు ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తున్నాయి. నటుడికంటే ముందుగా ఆయన అద్భుతమైన రచయిత. వందలాది చిత్రాలకు రచనలు చేశారు. మెంటల్ కృష్ణ, ఆపరేషన్ దుర్యోధన లాంటి చిత్రాలతో దర్శకుడిగా కూడా మారాడు.
ఆ చిత్రాలు పోసానికి దర్శకుడిగా మంచి గుర్తింపు తీసుకువచ్చినా కమర్షియల్ గా మాత్రం విజయం సాధించలేదు. నటుడిగా బిజీ అయ్యాక దర్శత్వం జోలికి వెళ్ళలేదు. ప్రస్తుతం పోసాని టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్. ఇదిలా ఉండగా పోసాని త్వరలో మెగాఫోన్ పట్టే ప్రయత్నంలో ఉన్నాడనేది తాజా సమాచారం.మెగాఫోన్ పట్టే ప్రయత్నంలో ఉన్నాడనేది తాజా సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాల ఆధారంగా ఆయన ఒక కథను సిద్ధం చేసుకున్నాడట.

సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటీనటులు ఎవరు.. ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే విషయాలు త్వరలో తెలియనున్నాయి. పోసాని కృష్ణ మురళి రాజకీయాలపై కూడా తరచుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు.


Click it and Unblock the Notifications











