twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ నలుగురినీ చంపితే ఏం లాభం? ఈ దేశం, పోలీసులు.. దిశా ఘటనపై పోసాని సంచలన వ్యాఖ్యలు

    |

    దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన దిశా మర్డర్ కేసుపై పెద్దఎత్తున సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. కొందరేమో నిందితులను ఉరితీయాలని అంటుంటే.. మరికొందరు మాత్రం ఉరితీయడం కాదు, సమాజంలో మార్పు తీసుకురావాలి అని పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ ఉదంతంపై వర్మ లాంటి వారు కూడా స్పందించగా తాజాగా నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తనదైన కోణంలో రియాక్ట్ అయ్యాడు. వివరాల్లోకి పోతే..

    ఈ దేశంలో ఉన్న క్రైమ్, అవినీతి ఎక్కడా లేదంటూ పోసాని ఆవేదన

    ఈ దేశంలో ఉన్న క్రైమ్, అవినీతి ఎక్కడా లేదంటూ పోసాని ఆవేదన

    భారతదేశం చాలా మంచి దేశమని పేర్కొన్న పోసాని.. ఈ దేశంలో ఉన్న క్రైమ్, అవినీతి ఎక్కడా లేదని అన్నాడు. ఇక్కడ రాజకీయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ ఏదీ నీతిగా లేదని తెలిపారు. ముందుగా ప్రజా వ్యవస్థ నీతిగా ఉండాలని అన్నారు. సమాజంలో ఉన్న ఎవడూ నీతిగా ఉండకుండా సమాజం నీతిగా ఉండాలంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

    ఇలాంటి వాళ్లు కోట్లలో ఉన్నారు

    ఇలాంటి వాళ్లు కోట్లలో ఉన్నారు

    ఆ నలుగురు రేప్ చేశారు కాబట్టి చంపేయండి అంటే ఇప్పుడు ప్రయోజనం లేదు. ఈ నలుగుర్నే చంపుతారు. ఇలాంటి వాళ్లు కోట్లలో ఉన్నారు. మరి వారి సంగతేంటి? అని ప్రశ్నించారు పోసాని. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. ఉరి వేస్తే చచ్చిపోతారు కానీ.. అవినీతి, అక్రమాలు, రేప్‌లు జరుగుతూనే ఉంటాయి. వ్యవస్థ నీతిగా ఉంటే క్రైమ్ జరగకుండా ఉంటుంది. అదే అసలైన మార్గం అని పోసాని అన్నారు.

     రేప్ చేసి మర్డర్ చేసిన నిందితులు పెద్ద క్రిమినల్స్ కాదు

    రేప్ చేసి మర్డర్ చేసిన నిందితులు పెద్ద క్రిమినల్స్ కాదు

    మనం ఎన్నుకునే నాయకులు, నియమించుకునే పోలీసులు, కొలిచే బాబాలు, అన్ని విభాగాల్లోని ఉద్యోగులు వీటన్నింటిపై మనల్ని మనం ప్రశ్నించుకున్నపుడే ఇలాంటి వాటికి సమాధానం దొరికుతుంది. ఈ వ్యవస్థలో ఉన్న వీళ్లందరితో పోల్చుకుంటే దిశాని రేప్ చేసి మర్డర్ చేసిన నిందితులు పెద్ద క్రిమినల్స్ కాదనేది తన లెక్క అంటూ సంచలన కామెంట్స్ చేశారు పోసాని.

     ఆ పోలీస్ బాయ్ ఫ్రెండ్‌తో వెళ్లిందా అని అడుగుతాడా?

    ఆ పోలీస్ బాయ్ ఫ్రెండ్‌తో వెళ్లిందా అని అడుగుతాడా?

    నా కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌కి వెళ్తే అక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్.. బాయ్ ఫ్రెండ్‌తో వెళ్లిందా అని అడుగుతాడా? సరే అతను అడిగాడు కాబట్టి ఇప్పుడు సస్పెండ్ చేస్తారు. తిరిగి ఏ ఎమ్మెల్యే, ఎంపీనో పట్టుకుని మళ్లీ ఉద్యోగంలో పెట్టిస్తాడు. వ్యవస్థలో ఇలాంటి వక్రమార్గాలు ఉన్నాక పోలీసులు ఎందుకు సక్రమమైన డ్యూటీ చేస్తారంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు పోసాని.

     మార్పు కావాలి? అంటున్నారు కానీ..

    మార్పు కావాలి? అంటున్నారు కానీ..

    ఇక దేశంలోని నాయకులతో పాటు జనం కూడా దారుణంగా ఉన్నారని అన్నాడు పోసాని. మార్పు కావాలి? అంతా మరాలి అంటున్నారు కానీ డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తున్నారు. ముందు వీడు కదా మారాలి. డబ్బు తీసుకోకుండా సేవ చేసే నాయకుడ్ని ఎన్నుకోవాలి. రాజకీయ, ఉద్యోగ వ్యవస్థలతో పాటు జనం వ్యవస్థ కూడా మారాలని ఘాటుగా మాట్లాడారు పోసాని కృష్ణ మురళి.

    అందరం ఇలా బాధపడటం వల్ల ఉపయోగం లేదు

    అందరం ఇలా బాధపడటం వల్ల ఉపయోగం లేదు

    దేశవ్యాప్తంగా కలకలం రేపిన దిశ రేప్, హత్యపై చాలా బాధపడుతున్నానని తెలిపిన పోసాని.. అందరం ఇలా బాధపడటం వల్ల ఉపయోగం ఉండదని అన్నారు. ఈ వ్యవస్థలో 90 శాతం మంది జనం కరెక్ట్‌గా లేరు. ఈ నలుగుర్నీ చంపేస్తే 130 కోట్ల మందిలో మార్పు రాదు. వ్యవస్థ మారితే అందర్లో మార్పు వస్తుందని ఆయన తెలిపారు.

    Recommended Video

    #CineBox : Jabardasth Effect On Nandamuri Balakrishna New Movie
    నిర్భయ చట్టం.. పోసాని సంచలన వ్యాఖ్యలు

    నిర్భయ చట్టం.. పోసాని సంచలన వ్యాఖ్యలు

    ఇలాంటి సంఘటనలను అరికట్టాలనే ఉద్దేశ్యంతో నిర్భయ చట్టాన్ని తెచ్చారు. అది వ్యవస్థలో మార్పు కోసం కాదు. క్రైం అండ్ పనిష్మెంట్ కోసమే అని అన్నారు పోసాని. ఇలా ఎంతమందిని చంపుతాం. ఎంత మందికి ఉరి శిక్ష వేస్తాం. ఇలా ఉరి వేసుకుంటూ పోతే.. కనీసం భారతదేశంలో ఉన్న 100 కోట్ల మందికి ఉరి శిక్ష వేయాల్సి ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బు తీసుకుని ఓటు వేసేవాడు రేపిస్ట్‌ కంటే డేంజర్ అన్నారు పోసాని.

    English summary
    Tollywood actor Posani Krishna Murali commented on Disha Murder Case. He says about police department and politicians in india.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X