Acharya Leaks: చిరంజీవి, చరణ్ తర్వాత ఆయనకే ఎక్కువ ప్రాధాన్యం

రీఎంట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో 'ఆచార్య' అనే సినిమాను చేస్తున్నారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. నక్సలిజంతో కూడిన సందేశాన్ని ఇచ్చే విధంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.

'ఆచార్య' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వీళ్లిద్దరి పాత్రలే ఎంతో హైలైట్‌గా నిలవబోతున్నాయి. వీళ్ల కలయికలో వచ్చే సీన్స్ పూనకాలు తెప్పించే విధంగా ఉంటాయని అంటున్నారు. అయితే, ఈ స్టార్ హీరోల తర్వాత ఇందులో పోసాని కృష్ణ మురళి పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందట. ఇంటర్వెల్ ముందు ఈ రోల్ చనిపోతుందని తెలుస్తోంది. ఎమోషనల్‌గా సాగే ఈ సీన్ ప్రేక్షకులతో కన్నీళ్లు తెప్పించే విధంగా తీశారనే టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర వల్లే సినిమా కథ మలుపు తిరుగుతుందని కూడా తెలిసింది.

Posani Krishna Murali Role Highlight in Acharya

భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'ఆచార్య' మూవీ షూటింగ్ ఇంకా పద్నాలుగు రోజులు బ్యాలెన్స్ ఉండిపోయింది. దీంతో ఈ సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయలేదు. ఇక, దీని నుంచి ఇప్పటికే విడుదలైన పాట, టీజర్, పోస్టర్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఇందులో హీరోయిన్లుగా చేస్తోన్నారు. ఈ సినిమాకు మెలోడీ కింగ్ మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X