భీమ్లా నాయక్ షూటింగ్ లో పవన్ క్రేజీ రైడ్.. బుల్లెట్ పై అలా స్వేచ్ఛగా వెళ్లిపోయిన పవర్ స్టార్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎన్ని పాన్ ఇండియా సినిమాలు వచ్చినా కూడా పవర్ స్టార్ సినిమాకు వచ్చే క్రేజ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక తెలుగు గడ్డపై పవర్ స్టార్ ఓపెనింగ్స్ తోనే నిర్మాతల్లో సగం ధైర్యాన్ని నింపేస్తారు. పవర్ స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకొని మంచి సినిమా తెరపైకి తీసుకు వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. ఇక రాబోయే భీమ్లా నాయక్ సినిమాపై కూడా అంచనాలు మామూలుగా లేవు. అయితే సినిమా షూటింగ్ స్పాట్ లో పవన్ కళ్యాణ్ ఎవరు ఊహించని విధంగా ఎలాంటి సెక్యూరీటి లేకుండా బైక్ పై అలా జాలిగా వెళ్లిపోవడం విశేషం. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషక్ మీడియాలో వైరల్ అవుతోంది.

వకీల్ సాబ్ సినిమాతో..

వకీల్ సాబ్ సినిమాతో..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది వకీల్ సాబ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటివరకు అత్యదిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా వకీల్ సాబ్ న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాతో కూడా మరింత పవర్ఫుల్ గా వసూళ్లను అందుకునే అవకాశం ఉంది.

 ఆఖరి షెడ్యూల్

ఆఖరి షెడ్యూల్

మలయాళం బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకి రీమేక్ గా వస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులన్నీ కూడా తుది దశకు చేరుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆఖరి షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.

వికారాబాద్ లో పవన్ షూట్

వికారాబాద్ లో పవన్ షూట్

ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం వికారాబాద్ లో జరుగుతోంది. ఇక పవన్ కళ్యాణ్ షూటింగ్ కోసం తమ ప్రాంతంలోకి వచ్చినట్లు తెలుసుకున్న ఫ్యాన్స్ ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. పవన్ కళ్యాణ్ ను మొదటిసారి చూసిన ఆనందంలో యువత ఒక్కసారిగా ఆయన కారు ముందుగా గుంపులుగా వచ్చేసారు అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా వారిని కంట్రోల్ చేసి దారి ఇవ్వాలని కోరారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 బుల్లెట్ బైక్ పై స్వేచ్ఛగా

బుల్లెట్ బైక్ పై స్వేచ్ఛగా

పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్ లో ఉన్న మరొక వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పవన్ కళ్యాణ్ బుల్లెట్ బైక్ పై స్వేచ్ఛగా అలా రోడ్డుపై వెళుతూ ఉన్నట్లు కనిపిస్తోంది. నిరంతరం భారీ స్థాయిలో సెక్యూరిటీతో ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత అలా స్వేచ్ఛగా బైక్ పై బయటకు వెళ్లినట్లు అర్థమవుతుంది. అందుకు సంబంధించిన వీడియో కూడా ఇంటర్నెట్లో వైరల్ గా మారింది

 వాయిదా అంటున్నారు.. కానీ..

వాయిదా అంటున్నారు.. కానీ..

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలంగా ఈ సినిమా తప్పకుండా వాయిదా పడుతుంది అని వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఎప్పటికప్పుడు నిర్మాత నగవంశీ మాత్రం సినిమా జనవరి 12 వ తేదీన తప్పకుండా వస్తుంది అని చెబుతున్నారు. మరి ఆ విషయం ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Recommended Video

Bheemla Nayak : Trivikram Srinivas Charges Rs 15 Crore For Pawan's Movie || Filmibeat Telugu

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X