Don't Miss!
- News
Student: టీచర్ కొట్టిన దెబ్బలకు ఐసీయూలో చేరిన విద్యార్థి, మాస్టర్ కు బీపీ వచ్చిందేమో ? !
- Sports
IND vs ENG: చెలరేగిన బెన్ స్టోక్స్.. కుప్పకూలిన భారత్! ఇంగ్లండ్ లక్ష్యం 378
- Finance
Uber Ride: రోడ్డు మీద విమానం ఛార్జీలు.. ముంబైలు ప్రయాణికులకు క్యాబ్ కష్టాలు.. వేల రూపాయలు..
- Lifestyle
Finance and career horoscope: జూలైలో 12 రాశుల ఆర్థిక మరియు కెరీర్ జాతకం..మరి మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోండి..
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్పూర్..
- Technology
భారత్లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
విశ్వక్ సేన్ కోసం పవన్ కళ్యాణ్.. ఆ స్టార్ హీరో డైరెక్షన్ లో న్యూ మూవీ.. ఫొటో వైరల్
టాలెంటెడ్ యువ హీరో విశ్వక్ సేన్ వరుసగా విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. పాగల్, అశోక వనంలో అర్జున కళ్యాణం అనే రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనే విధంగా మంచి వసూళ్లను అందుకున్నాయి. ఇక విశ్వక్ సేన్ తదుపరి సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అతని నెక్స్ట్ సినిమా ను ఒక సీనియర్ హీరో దర్శకత్వంలో చేస్తుండగా ఇటీవల ఆ సినిమా లాంచ్ కోసం ప్రత్యేకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
విశ్వక్ సేన్ కథానాయకుడిగా ఒక కొత్త సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ఓపెన్ అయ్యింది. ఇక ఈ సినిమాకు ప్రముఖ సీనియర్ టాలెంటెడ్ హీరో అర్జున్ దర్శకత్వం వహిస్తుండడం విశేషం. కేవలం హీరోగానే కాకుండా ఒకప్పుడు దర్శకుడిగా కూడా మంచి సినిమాలను తెరపైకి తీసుకు వచ్చిన అర్జున్ ఇటీవల కాలంలో మాత్రం సరైన విజయాలను అందుకోలేకపోయారు. కానీ ఆయన నటుడిగా మాత్రం కొన్ని సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ మంచి క్రేజ్ అందుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం విశ్వక్ సేన్ కొత్త సినిమాపైనే ఉంది. ఈ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిధిగా రావడం విశేషం. ఆయన చేతుల మీదుగా మొదట క్లాప్ కొట్టి సినిమాను స్టార్ట్ చేశారు. గతంలోనే పవన్ అర్జున్ కు మంచి సాన్నిహిత్యం ఉండడంతో ఈ సినిమాను లాంచ్ చేసేందుకు వచ్చారు. ఇక ఈ సినిమా లాంచ్ కు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ మేయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.
. @PawanKalyan at @VishwakSenActor new movie pooja ceremony 💙 pic.twitter.com/Cw1FmTQYlP
— KARNATAKA PawanKalyan FC™ (@KarnatakaPSPKFC) June 23, 2022