పైరసీ గళం విప్పితే మద్దతు. జాల్సా కోసం అలాంటి సహాయం.. మహేష్‌కు పవన్ కల్యాణ్ బర్త్ డే విషెస్

తెలుగు సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు తన జన్మదినాన్ని అభిమానుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకొంటున్నారు. ఆయన బర్త్ డే పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఆయన నటించిన పోకిరి, ఒక్కడు సినిమాలను భారీగా ప్రదర్శిస్తున్నారు. మహేష్ జన్మదినం సందర్భంగా ఆయనకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపి.. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన పవన్..ప్రముఖ కథానాయకులు శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ప్రత్యేకంగా ఓ ప్రకటన విడుదల చేశారు. మహేష్ బాబు తనదైన శైలి నటనతో నవతరం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆయన చేపట్టే సేవా కార్యక్రమాలు... హృద్రోగంతో బాధపడే చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయించడం అభినందనీయం. సూపర్ స్టార్ శ్రీ కృష్ణ గారి నట వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ.. తండ్రి బాటలోనే దర్శకులకు, నిర్మాతలకు అండగా నిలుస్తున్నారు అని తన ప్రకటనలో తెలిపారు.

 Power star Pawan Kalyan birth day wishes to super star Mahesh Babu

'అర్జున్' సినిమా సందర్భంలో పైరసీపై పోరాటానికి శ్రీ మహేష్ బాబు గారు తన గళం వినిపిస్తే ఆయనకు మద్దతుగా నిలిచాను. పరిశ్రమను కాపాడుకొనేందుకు ఆయన ముందుకు రావడంతో అందరం వెన్నంటి నిలిచాం. 'జల్సా' సినిమాలో సంజయ్ సాహూ పాత్రను పరిచయం చేసేందుకు శ్రీ మహేష్ బాబు గారి నేపథ్య గాత్రం అయితే బాగుంటుందని, దర్శకులు శ్రీ త్రివిక్రమ్ గారు కోరగానే అంగీకరించిన సహృదయత శ్రీ మహేష్ బాబు గారిది. కథానాయకుడిగా తనదైన పంథాలో వెళ్తూ ప్రేక్షకుల మెప్పు, పురస్కారాలూ అందుకొంటున్న శ్రీ మహేష్ బాబు గారు మరిన్ని విజయాలు అందుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని మహేష్‌తో ఉన్న అనుబంధాన్ని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X