Pawan Kalyan: వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల పెళ్లి కోసం ఇటలీకి పవన్ కల్యాణ్ దంపతులు.. ఫొటోలు వైరల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు వింటే చాలు ఆయన ఫ్యాన్స్ అంతా పూనకాలతో ఊగిపోతుంటారు. ఇక ఆయన కనిపించినా, మాట వినిపించిన అదృష్టంగా ఫీలవుతారు. ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న ఆయన ఫ్యామిలీ కోసం కూడా సమయం కేటాయించారు. త్వరలోనే ఎన్నికలు ఉన్నప్పటికీ.. తన అన్న నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పెళ్లికి వెళ్లేందుకు సిద్ధం అయ్యాడు. అయితే ఈ వేడకకు తాను ఒంటరిగా వెళ్లకుండా.. భార్య అన్నా లెజినోవాను కూడా వెంట తీసుకెళ్లాడు.

పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా దంపతులు ఇద్దరూ కలిసి ఇటలీకి వెళ్లేందుకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడే మీడియా కంట పడ్డారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నాలెజినోవా ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. క్రీమ్ కలర్ ప్యాంట్ చెక్స్ విత్ హాఫ్ హ్యాండ్స్ షర్ట్ వేసుకొని పవన్ కల్యాణ్ చాలా సింపుల్ లుక్ లో కనిపించారు. అలాగే ఆయన భార్య అన్నా లెజినోవా ఓ వైట్ షర్డు వేసుకొని బ్లూ కలర్ ప్యాంటు వేసుకుంది. చేతిలో ఓ హ్యాండ్ బ్యాగు పట్టుకొని పవన్ కల్యాణ్ వెనకాల నడుస్తూ కనిపించింది.

Power Star Pawan kalyan Going to Italy With His Wife Anna lezhneva For Varun Tej Lavanya Tripathi Marriage

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. మీ జంటను ఇలా కలిసి చూడడం చాలా బాగుందంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. అన్నాయ్యా లుక్ అదిరింది, మీరెలా ఉన్నా సింహమే అంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరోవైపు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్లి నవంబర్ ఒకటో తేదీన ఇటలీలోని టుస్కానీ నగరంలో చాలా గ్రాండ్ గా జరగబోతుంది. అతి తక్కువ మంది సన్నిహితులు, బంధువుల మధ్య వీరి పెళ్లి వేడుకలు నిర్వహించబోతున్నారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఏర్పాట్లను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే ఈ జంట ఇటలీ వెళ్లిపోయింది. అయితే నిన్న వరుణ్, లావణ్యలతో పాటు మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా ఇటలీకి వెళ్లింది. అయితే తాజాగా పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా వెళ్లడంతో అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీరే కాకుండా అల్లు కుటుంబం కూడా ఈ పెళ్లికి వెళ్లబోతుంది. ఈరోజో, రేపో వారంతా ఇటలీకి చేరుకుంటారు.

నవంబర్ ఒకటో తేదీన వరుణ్ తేజ్.. మూడు ముళ్లు వేసి మరీ లావణ్య త్రిపాఠిని తన భార్యను చేసుకుంటాడు. ఈ వేడుక పూర్తయ్యాక.. వరుణ్ తేజ్, లావణ్య దంపతులతో పాటు మెగా, అల్లు, త్రిపాఠి ఫ్యామిలీలు హైదరాబాద్ కు చేరుకుంటారు. ఇక్కడకు వచ్చాక నవంబర్ ఐదో తేదిన వీరి రిసిప్షన్ వేడుకను అంగరంగ వైభవంగా చేయబోతున్నారు. ముఖ్యంగా పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు ఎవరినీ ఆహ్వానించకోవడంతో.. కనీసం రిసిప్షన్ కు అయినా అందరినీ పిలవాలని భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రిసిప్షన్ కోసం ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X