HariHara VeeraMallu: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. హరిహర వీరమల్లు ప్రోమో వచ్చేస్తోంది!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలకు ఓకే చెప్పారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో బిజీ అవడంతో ఆ సినిమాలు అన్నీ ఆగిపోయాయి. ఇప్పటికే మూడు చిత్రాలు నిలిచిపోయాయి. అయితే చాలా కాలం తర్వాత ఈ సినిమాల నుంచి మెళ్లిమెళ్లిగా ఒక్కో అప్ డేట్ వస్తుంది. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ వాళ్ల మరో గుడ్ న్యూస్ చెప్పారు. హరిహరి వీరమల్లు గురించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
పవన్ కళ్యాణ్ హీరోగా... డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమానే హరిహర వీరమల్లు. అయితే పవన్ కల్యాణ్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిష్- పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం కూడా ఇదే కావడంతో పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను ఇప్పటి వరకు పీరియాడిక్ సినిమాల్లో చూడకపోవడం కూడా దీనిపై బజ్ కు కారణం అయింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను సెలెక్ట్ చేశారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంలో ఈ సినిమాను ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమా ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. హైపర్ ఆది వంటి వాళ్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పండుగలు సాయన్న అనే ఒక బందిపోటు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. రెండు డిఫరెంట్ టైమ్ పీరియడ్స్ లో ఈ కథ సాగుతుందని టాక్ నడించింది.
అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడూ పూర్తయిపోయిందని... త్వరలోనే టీజర్ కూడా వచ్చేస్తుందంటూ.. చాలానే వార్తలు వచ్చాయి. కానీ వీటిపై చిత్రబృందం స్పంతించలేదు. అలాగే కరోనాతో షూటింగ్ ఆగిపోవడం, పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో ఈ సినిమా బ్రేకులు పడ్డాయి. కానీ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ను మెగా సూర్య ప్రొడక్షన్స్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.

హరిహర వీరమల్లు సినిమా అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు, సినీ ప్రేమికులు అందరికీ గుడ్ న్యూస్ అంటూ తెలిపింది. ప్రస్తుతం ఇరాన్, కెనడా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి చోట్ల మా ప్రతిష్టాత్మక సినిమా హై ఎండ్ వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుగుతోందని తెలిపింది. ఈ సినిమా అప్ డేట్ అభిమానుల అంచనాలను తాకుతుందని.. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోను విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు.


Click it and Unblock the Notifications











