పవన్ కల్యాణ్‌కు తీవ్ర అనారోగ్యం.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు.. ఏమైంది?

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన భారీ యాక్షన్ అండ్ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ OG రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకల్లో పవన్ కళ్యాణ్ వరుసగా పాల్గొంటూ వచ్చారు. మరోవైపు అటు ఆంధ్రప్రదేశ్ పాలన బాధ్యతలను కూడా చూస్తూ ఉన్నారు. దీంతో విరామం లేకుండా ఆయన సినీ ఈవెంట్లకు, ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతూనే వస్తున్నారు. మరోవైపు వాతావరణంలో భారీ మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే.

వరుసగా వర్షాలు పడుతున్నా ఏపీ ఉప ముఖ్యమంత్రి తన బాధ్యతలన్నింటినీ పూర్తి చేస్తున్నారు. వరుస కార్యక్రమాలతో ఆయనకు విశ్రాంతి లేకుండా పోయింది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ కు కూడా గురయ్యారు. గత నాలుగు రోజులుగా వైద్యం చేయించుకొంటున్నారని ఉప ముఖ్యమంత్రి సిబ్బంది తెలియజేసింది. జ్వరం తీవ్రత తగ్గలేదని, ఇంకా దగ్గు ఎక్కువగా ఉండటంతో ఇబ్బందిపడుతున్నారన్నారు.

Power Star Pawan Kalyan Hospitalized Due to Illness

వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. ఈరోజు పవన్ కల్యాణ్ మంగళగిరి నుంచి హైదరాబాద్ మెరుగైన వైద్యం వెళ్తున్నారని తెలిపారు. అంతే కంటే ముందు పవన్ కళ్యాణ్ ఏపీ రాజధాని అమరావతికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. గత వారం రోజులుగా ఏపీలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పైగా ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. బాలకృష్ణ వ్యాఖ్యల నేపథ్యంలో కొనసాగుతున్న వివాదం, ఇతర అధికారిక, శాఖ పరమైన సమావేశాల్లో పాల్గొనేందుకు ఏపీ రాజధానికి పవన్ కళ్యాణ్ ముందుగా వెళ్తున్నట్టు తెలిసింది. ఆ తర్వాత తన వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ కు వెళ్తున్నారని తెలుస్తోంది.

ఇక బాలకృష్ణ ఇటీవల గత ప్రభుత్వం వైఎస్ జగన్ ను సినిమాల విషయంలో గట్టిగా అడగలేదని, ఇక తనను అస్సలే పిలవలేదని విదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా చిరంజీవి కూడా స్పందించే వరకు వచ్చిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ పై, చిరంజీవిపై బాలయ్య చేసిన కామెంట్స్ ఏపీ అసెంబ్లీలో హాట్ టాపిక్ గ్గా ఉన్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ వెంటనే ఏపీ రాజధానిలో ప్రభుత్వ పరంగా నిర్వహించే సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని తన అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు అభిమానులకు పవన్ కళ్యాణ్ OGతో పండుగ తీసుకు రావడంతో ఫుల్ ఖుషిలో ఉన్నారు. థియేటర్లలో సందడి సందడి నెలకొంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ OG. ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య రూ.250 కోట్ల బడ్జెట్ తో భారీ స్కేల్లో నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్ డే 167 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ ను వసూల్ చేయడం విశేషం. ఇక ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్ రాష్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X