Pawan Kalyan న్యూ లుక్ వైరల్.. బంగారం లాంటి బాలు స్టైల్ లో పవర్ స్టార్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ లో ఎంత సింపుల్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వెండితెరపై కూడా దాదాపు పవన్ కళ్యాణ్ అదే తరహా మేనరిజంతో కనిపిస్తాడు. కానీ పవర్ స్టార్ ఒకప్పుడు స్టైల్ లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచేవారు. ఏలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త తరహ స్టిల్స్ తో కనిపిస్తూనే ఉంటారు. ఇక చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ తన స్టైలిష్ లుక్ బయటపెట్టినట్లు తెలుస్తోంది.

డిఫరెంట్ క్రేజ్

డిఫరెంట్ క్రేజ్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా కూడా అందులో ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉండే క్రేజ్ మరింత డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పవచ్చు. వెండితెరపై పవర్ స్టార్ కనిపిస్తే చాలు ఫ్యాన్స్ లో జోష్ ఏ రేంజ్ ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫొటో వైరల్ అవుతూనే ఉంటుంది.

పాలిటిక్స్ లోకి వెళ్ళిన తర్వాత

పాలిటిక్స్ లోకి వెళ్ళిన తర్వాత


ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల కాలంలో ఆయన పాలిటిక్స్ లోకి వెళ్ళిన తర్వాత స్టైలిష్ లుక్స్ కి కాస్త దూరంగానే ఉన్నారు. అయితే అప్పుడప్పుడు మాత్రం పర్సనల్ ఫ్యామిలీతో బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ తన స్టైల్ ను కొంచెం మారుస్తున్నాడు అని తెలుస్తోంది.

ఫ్యామిలీతో కలిసి..

ఫ్యామిలీతో కలిసి..

ఇటీవల సతీమణి అన్నా లెజ్ నోవా తో కలిసి పవన్ కళ్యాణ్ రష్యా వెళ్లిన విషయం తెలిసిందే. క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడిపాడు. ఇక ఇటీవల మళ్లీ చాలా తొందరగానే ఇండియాకు తిరిగి వచ్చేశారు.

బాలు, బంగారం లాంటి లుక్

బాలు, బంగారం లాంటి లుక్


ఇక ఇటీవల ఎయిర్ పోర్ట్ లో పవన్ కళ్యాణ్ దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పవర్ స్టార్ పవన్కళ్యాణ్ సింపుల్ గానే ఉన్నప్పటికీ ఈ స్టైల్ మళ్ళీ పాత సినిమాలను గుర్తుచేస్తుంది అన్నట్లుగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కేవలం బ్లాక్ షర్ట్, జీన్స్ లోనే ఉన్నప్పటికీ గతంలో పవన్ కళ్యాణ్ బాలు బంగారం లాంటి సినిమాల్లో ఇదే తరహాలో దర్శనం ఇచ్చిన విషయం తెలిసిందే.

హరీష్ శంకర్ సినిమాలో..

హరీష్ శంకర్ సినిమాలో..

పవన్ కళ్యాణ్ ఐదు పదుల వయసులో కూడా పాతికేళ్ల కుర్రాడి తరహాలో కనిపిస్తున్నాడు అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ మళ్లీ ఇలాంటి లుక్స్ లో చూడాలి అని ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే రాబోయే హరీష్ శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ కాస్త స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడు కాబట్టి ఇలాంటి స్టైలిష్ లుక్ లో దర్శనమిస్తాడు అని చెప్పవచ్చు.

రాబోయే సినిమాలు

రాబోయే సినిమాలు

ఇక దాదాపుగా బీమ్లా నాయక్ పనులన్ని పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నాడు. ఆ తరువాత సురేందర్ రెడ్డి తో కూడా ఒక సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X