పవన్ కళ్యాణ్ నా అసలు పేరు కాదు.. షాకింగ్ నిజం చెప్పిన పవర్ స్టార్!

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan)గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటు సినిమాల్లో, అటు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు పవన్ కళ్యాణ్. సినిమాల ద్వారా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న పవన్ .. అటు రాజకీయాల్లో కూడా కోట్లాది అనుచరులను సంపాదించుకున్నారు. ఇలా రెండు రంగాల్లో దూసుకెళ్తున్న పవర్ స్టార్ గురించి ఆయన అభిమానులకు తెలియని విషయాలు దాదాపు ఏవీ ఉండవు. కానీ తాజాగా ఆయన స్వయంగా 'పవన్ కళ్యాణ్'అనేది తన అసలు జన్మనామం కాదని వెల్లడించారు. ఈ విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. తన అసలు పేరు 'శ్రీ కళ్యాణ్ కుమార్' అని తెలిపారు. తిరుమల దేవస్థానంలోని శ్రీ యోగ నరసింహస్వామి ఆలయంలో తన నామకరణం జరిగిందని, ఆ సమయంలో తన తల్లిదండ్రులు తనకు 'శ్రీ కళ్యాణ్ కుమార్' అనే పేరు పెట్టారని చెప్పారు. అయితే స్కూల్‌లో అడ్మిషన్ సమయంలో రికార్డుల్లో 'శ్రీ'అనే పదం తొలగిపోవడంతో 'కె. కళ్యాణ్ కుమార్'గా నమోదైందని వివరించారు.

Power Star Pawan Kalyan Reveals His Real Name and the Fascinating Story Behind Pawan

అయితే.. ఇంట్లో మాత్రం అందరూ తనను 'కళ్యాణ్ బాబు' అని పిలిచేవారని పవన్ చెప్పారు. ఇప్పటికీ కుటుంబ సభ్యులు అదే పేరుతో సంబోధిస్తారని వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కుటుంబంలో చిన్నవాడిగా ఉండటం వల్ల తనపై అందరికీ ప్రత్యేకమైన ప్రేమ ఉండేదని గుర్తుచేసుకున్నారు. అలాగే రామ్ చరణ్ (Ram Charan)కూడా 'కళ్యాణ్ బాబాయ్' అని పిలుస్తాడే తప్ప 'పవన్ కళ్యాణ్ బాబాయ్'అని ఎప్పుడూ పిలవడని సరదాగా చెప్పారు.

అయితే 'పవన్'అనే పదం తన పేరులోకి ఎలా వచ్చిందన్నదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాల్లోకి రాకముందు పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన శారీరక సామర్థ్యాన్ని చూసి గురువులు ఆశ్చర్యపోయేవారట. ముఖ్యంగా ఛాతీపై భారీ బరువైన రాళ్లను ఉంచుకుని వాటిని పగలగొట్టించే పవర్ డెమోన్స్ట్రేషన్స్ చేసేవారని పవన్ తెలిపారు. తన గుండెలపై 400 నుంచి 450 కిలోల వరకు బరువున్న రాళ్లను పగలగొట్టించుకునే విన్యాసాలు చేసేవాడినని చెప్పారు.

ఈ అసాధారణ శక్తిని గమనించిన ఆయన మార్షల్ ఆర్ట్స్ గురువు, హనుమంతుడి మరో పేరైన 'పవనపుత్ర' నుంచి స్ఫూర్తి పొంది 'పవన్' అనే పదాన్ని తన పేరుకు ముందు జోడించారని వెల్లడించారు. అలా 'కళ్యాణ్ కుమార్' కాస్త 'పవన్ కళ్యాణ్'గా మారిపోయాడని వివరించారు. ఈ పేరులో హనుమంతుడి ఆశీర్వాదం, బలం, ఆధ్యాత్మికత కూడా దాగి ఉన్నాయని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి కూడా గతంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మొదట తమ కుమారుడికి 'శ్రీ కళ్యాణ్ కుమార్' అనే పేరు పెట్టామని, తరువాత కాలక్రమేణా 'పవన్ కళ్యాణ్'గా మారాడని ఆమె వెల్లడించారు. ఇప్పుడు పవన్ స్వయంగా తన పేరు వెనుక కథ చెప్పడంతో అభిమానులకు పూర్తి క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ఈ ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు 'పవర్ స్టార్' పేరు వెనుక ఇంత గొప్ప కథ ఉందా ? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X