HariHara VeeraMallu : వీరమల్లు మాట వినాల్సిందే .. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ఫస్ట్ సింగిల్

రాజకీయాలు, పాలనా వ్యవహారాలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఆయనను తెరపై చూసి చాలా ఏళ్లే గడుస్తుండటంతో పవన్ అభిమానులు బాధపడుతున్నారు. చేతిలో ఉన్న సినిమాలను కంప్లీట్ చేయాలని పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నా వీలు కుదరడం లేదు. అయితే హరిహర వీరమల్లును మాత్రం ఎలాగైనా పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు.

హరిహర వీరమల్లును తొలుత క్రిష్ జాగర్లమూడి స్టార్ట్ చేసినప్పటికీ .. ప్రాజెక్ట్ మధ్యలోనే ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో చిత్ర నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ పగ్గాలు చేపట్టారు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసినప్పటికీ .. ఒక్క పవన్ కళ్యాణ్ పార్ట్ మాత్రమే మిగిలి ఉంది. అయితే వీరమల్లు షూటింగ్‌లో పవన్ పాల్గొంటారంటూ ఇప్పటి వరకు రకరకాల కథనాలు వచ్చాయి. కానీ అవన్నీ గాసిప్స్‌గానే మిగిలిపోయాయి.

Power star pawan kalyan s hari hara veera mallu Movie first song Maata Vinaali released

అయితే కొద్దిరోజుల క్రితం మాత్రం పవర్ స్టార్ అభిమానులు పూనకాలతో ఊగిపోయే న్యూస్ బయటికొచ్చింది. డిప్యూటీ సీఎం షూటింగ్‌లో పాల్గొన్న ఫోటోను నిర్మాత ఏఎం రత్నం ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అలాగే వీరమల్లు మిమ్మల్ని మార్చి 28, 2025న థియేటర్‌లలో కలుస్తారంటూ రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. అది వినగానే పవన్ అభిమానులు పండగ చేసుకున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ ఫేమ్ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. యానిమల్ విలన్ బాబీ డియోల్ ఔరంగజేబుగా కనపించనున్నారు. నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, పూజిత పొన్నాడ, సచిన్ ఖేడేకర్, రఘుబాబు, సుబ్బరాజు తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. రిలీజ్ టైం దగ్గరపడుతుండటంతో షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయడంతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది.

సంక్రాంతికి వీరమల్లు నుంచి ఏదో ఒక అప్‌డేట్ ఖచ్చితంగా ఉంటుందని అభిమానులు ఊహించారు, మేకర్స్ సైతం ఈ సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రోమో రిలీజ్ చేసింది. చెప్పినట్లుగానే ''వినాలి.. వీరమల్లు మాట చెబితే వినాలి ' అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను స్వయంగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఆలపించగా.. కీరవాణి సంగీతం అందజేశారు. ఏం గురాయించి చూస్తున్నవ్.. భయపెట్టనీకా? , చాలా మందిని జూసినాం అంటూ తెలంగాణ యాసలో పవన్ చెప్పిన డైలాగ్స్ ఈ పాటకు హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఈ లిరికల్ వీడియోలో పవన్ , నాజర్, కబీర్ సింగ్ దుహాన్‌లు కనిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X