రవితేజ రీమేక్ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్!
మాస్ మహారాజ రవితేజ వరుస చిత్రాలతో బిజీగా మారుతున్నాడు. ప్రస్తుతం రవితేజ విఐ ఆనంద్ దర్శత్వంలో డిస్కోరాజా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. అమర్ అక్బర్ ఆంటోని తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రం ఇదే. ఇదిలా ఉండగా రవితేజ మరో చిత్రాన్ని కూడా ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నాడు. రవితేజ చాలా కాలం క్రితమే తేరి చిత్ర రీమేక్ లో నటించాల్సింది. కానీ అనుకోని కారణాల వలన ఆ చిత్రం ఆలస్యం అవుతూనే వస్తోంది.
త్వరలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు. విజయ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం తేరిని తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ పవర్ ఫుల్ టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 'కనకదుర్గ' అనే టైటిల్ ని ఈ చిత్రాన్ని పెట్టేందుకు సంతోష్ శ్రీనివాస్ ఆలోచిస్తున్నాడట.

మైత్రి మూవీస్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. హీరో రామ్ తో తెరకెక్కించిన హైపర్ చిత్రం తర్వాత సంతోష్ శ్రీనివాస్ మరో చిత్రాన్ని రూపొందించలేదు. రవితేజ డిస్కోరాజా, తేరి రీమేక్ చిత్ర షూటింగ్ సమాంతరంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











