వైరల్ పిక్స్.. డార్లింగ్ ఫ్యాన్స్ డైరెక్టర్ స్పెషల్ సర్‌ప్రైజ్
ప్రభాస్ అభిమానులకు అందరి హీరోల ఫ్యాన్స్ కంటే ఎదురు చూపులు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే సినిమా ఎప్పుడో మొదలై రెండు మూడు షెడ్యూల్స్ అవుతున్నా కూడా ఓ పోస్టర్ గానీ, ఓ అప్‌డేట్ గానీ, ఫస్ట్ లుక్ గానీ, టైటిల్ గానీ ప్రకటించలేదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. ఆ మధ్య ఒత్తిడి తట్టుకోలేక నిర్మాణ సంస్థపై విరుచుకుపడ్డారు. దెబ్బకు యూవీ క్రియేషన్స్ ఓ మెట్టు దిగి స్పందించాల్సి వచ్చింది.
అల్లు అర్జున్ పుష్ఫ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రోజు.. యూవీ క్రియేషన్స్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ ఊగిపోయారు. డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా ట్వీట్లదాడి చేశారు. దీంతో యూవీ క్రియేషన్ స్పందిస్తూ.. కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో ఎలంటి అప్‌డేట్స్ ఇవ్వకూడదని అనుకుంటున్నామని తెలిపారు. పరిస్థితులన్నీ చక్కబడ్డాక చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయని తెలిపింది.


అయితే అంతలోపు డార్లింగ్ ఫ్యాన్స్‌ను కూల్ చేసేందుకు దర్శకుడు రాధాకృష్ణ.. మూవీ ఓపెనింగ్ పిక్స్‌ను షేర్ చేశాడు. వరుసబెట్టి ఫోటోలను వదలడంతో ప్రభాస్‌ను చూసిన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. ఈ మూవీ ఓపెనింగ్‌కు రాజమౌళి, వివి వినాయక్ వంటి దర్శకులు హాజరయ్యారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి ఓ డియర్ లేదా రాధే శ్యామ్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.



Click it and Unblock the Notifications











