ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్.. వాటిని మించేలానే ఉంటుంది.. ఒట్టేసి చెబుతున్న డైరెక్టర్

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ సెట్ అయింది. అసలు ఇలాంటి ఓ కాంబినేషన్ ఓకే అవుతుందని కూడా ఎవ్వరూ ఊహించి ఉండరు. అందరూ అవాక్కయ్యేలా అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది వైజయంతీ సంస్థ. ప్రభాస్ అభిమానులకు ఇది కచ్చితంగా పండగలాంటి వార్తే. అయితే ఈ మూవీ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అందరిలోనూ ఉండటం సహజమే. దానికి సమాధానం కూడా దొరికేసింది. తాజాగా నాగ్ అశ్విన్ చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ఓ డియర్‌ అంటూ..

ప్రస్తుతం ఓ డియర్‌ అంటూ..

బాహుబలి, సాహో చిత్రాలతో ప్రభాస్ ఇమేజ్ ఏ రేంజ్‌లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ప్రభాస్ మ్యానియాతోనే బాక్సాఫీస్ వద్ద రూ. 300కోట్ల మేర వసూళ్లు వచ్చాయంటేనే డార్లింగ్ రేంజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ప్రభాస్ ఓ విభిన్న ప్రేమ కథా చిత్రాన్ని చేస్తున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ప్రభాస్ 21వ మూవీ అప్‌డేట్ రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్‌లో ఆనందం రెట్టింపు అయింది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో..

ప్రభాస్ తదుపరి చిత్రం గురించి వచ్చిన ఈ అప్‌డేట్ జాతీయ స్థాయిలో ట్రెండ్ అయింది. మహానటి తరువాత మరో ప్రాజెక్ట్ తెరకెక్కించని నాగ్ అశ్విన్ ప్రభాస్‌తో ఓ సినిమా చేయనున్నట్లు వైజయంతీ సంస్థ ప్రకటించిన వెంటనే అందరూ షాక్ అయ్యారు. ఇది కూడా ఓ కొత్త ప్రయోగమే అయి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.

Recommended Video

Prabhas 21 : Nag Ashwin To Direct Prabhas | Vyjayanthi Movies || Filmibeat Telugu

ప్రముఖ సినీ జర్నలిస్ట్ ట్వీట్..


ప్రముఖ సినీ జర్నలిస్ట్ రాజీవ్ మసాంద్ ఈ కాంబినేషన్ గురించి మాట్లాడుతూ.. మహానటి చిత్రాని తెరకెక్కించిన నాగ్ అశ్విన్ ప్రభాస్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉంది.. ఈ ఇద్దరూ కలిసి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలని ఉందంటూ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన నాగ్.. కచ్చితంగా ఇది వరకు చేసిన దానికి మించి.. కనీసం కొన్ని మెట్లు ఎక్కించేలానే ఉంటుంది.. ప్రామిస్ అంటూ రిప్లై ఇచ్చాడు.

స్పందించిన నాగ్..

స్పందించిన నాగ్..

నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబోలో మూవీ ప్రకటన వచ్చాక ఎందరి మైండ్‌లో ఎన్నో ఆలోచనలు.. ఈ కథ ఏమై ఉంటుంది? ఎలా ఉండబోతోంది? ప్యాన్ ఇండియానా? ఇలా పలు రకాలు ప్రశ్నలు తలెత్తాయి అందరిలోనూ. అయితే వీటన్నంటికి నాగ్ అశ్విన్ ఒక్క ట్వీట్‌తో బదులిచ్చాడు.

ప్యాన్ వరల్డ్ డార్లింగ్స్

ఈ ఏడాది చివర్లో షూట్ మొదలై.. వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయోచ్చేమోనని చెప్పుకొచ్చాడు. అయితే ఈ మూవీ గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపడినట్టు అవుతుంది.. ప్రభాస్ గారికి థ్యాంక్స్ తప్పా ఇంకేమీ చెప్పలేను. కొంత మంది ఇది ప్యాన్ ఇండియానా? అని అడుగుతున్నారు.. ప్యాన్ ఇండియా ఎప్పుడో కొట్టేశారు.. ఇది ప్యాన్ వరల్డ్ డార్లింగ్స్' అంటూ అదిరిపోయే ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X