twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prabhas 25 With Director Sandeep Vanga: మొదటిసారి అలాంటి లుక్ లో రెబల్ స్టార్.. మొత్తం 8 భాషల్లో..

    |

    రెబల్ స్టార్ ప్రభాస్ గ్యాప్ లేకుండా పాన్ ఇండియా కథలను చాలా వేగంగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఒక సినిమా తర్వాత మరొక సినిమాను అంతకు మించి అనేలా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. బాహుబలి అనంతరం రెబల్ స్టార్ కథల ఎంపిక విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు. దర్శకులు నిర్మాతలు కూడా అతని కోసం అనుకున్నట్లుగానే సరైన కథలను తీసుకువస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ 25వ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా తెలియజేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ 25వ సినిమా కు సంబంధించిన విశేషాలు చాలానే ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఆ సినిమా వివరాల్లోకి వెళితే..

    వరుసగా పాన్ ఇండియా సినిమాలు

    వరుసగా పాన్ ఇండియా సినిమాలు

    ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. రాధేశ్యామ్ సినిమాను రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తుండగా ఆ తర్వాత సలార్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత 23వ ప్రాజెక్టును ఓం రావత్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆది పురుష్ అనే ఆ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇటీవల 24వ ప్రాజెక్టును నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సెట్స్ పైకి తెచ్చిన విషయం తెలిసిందే.

    పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా 25వ సినిమా

    పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా 25వ సినిమా

    ఇక అంతే కాకుండా రెబల్ స్టార్ ప్రభాస్ తన 25వ సినిమాపై కూడా క్లారిటీ అయితే ఇచ్చేశాడు. ప్రస్తుతం లైన్ లో ఉన్న సినిమాలు కూడా శరవేగంగా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా తెరకెక్కుతున్నాయి. ఇక 25వ సినిమా కూడా అదే తరహాలో ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అంతేకాకుండా యాక్షన్ కమర్షియల్ అంశాలు కూడా ఉండాలని మొన్నటి వరకు చర్చలు జరిపారు. 25వ సినిమా కాబట్టి అంతకుమించి అనేలా ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అందుకే సరైన కథ కోసం ప్రభాస్ ఎదురుచూస్తున్నాడు.

    స్పిరిటీ టైటిల్ ఫిక్స్.. 8 భాషల్లో

    స్పిరిటీ టైటిల్ ఫిక్స్.. 8 భాషల్లో

    యు.వి క్రియేషన్స్ బ్యానర్ లోనే ప్రభాస్ 25వ సినిమా తెరకెక్కబోతున్న క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాకుండా ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. తెలుగులోనే కాకుండా హిందీ తమిళం మలయాళం కన్నడ చైనీస్ జపాన్ కొరియన్ ఇలా మొత్తంగా 8 భాషల్లో కూడా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. టి సిరీస్ ఈ సినిమాను యువి క్రియేషన్స్ తో సంయుక్తంగా నిర్మించడానికి సిద్ధమైంది.

    బడ్జెట్ ఎంతంటే..

    బడ్జెట్ ఎంతంటే..

    ఊహించినట్లుగానే అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఇప్పటి వరకు ప్రభాస్ ఏ సినిమాలో ఖాకీ చొక్కాల్ కనిపించలేదు. మొదటిసారి స్పిరిట్ సినిమా కోసం ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

    ముఖ్యంగా సినిమా కోసం యు.వి.క్రియేషన్స్ టీ సీరీస్ 500 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశముందట. సినిమా స్క్రిప్ట్ పనులు కూడా ఫినిష్ అయినట్లు తెలుస్తోంది. చేతిలో ఉన్న రెండు సినిమాలను పూర్తి చేసిన తర్వాత ప్రభాస్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. మరో వైపు దర్శకుడు సందీప్ వంగా బాలీవుడ్లో ఏనిమల్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

    English summary
    Prabhas 25 Movie Spirit With Director Sandeep Reddy Vanga Official Announcement is out,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X