ప్రభాస్ 25వ సినిమా.. పదేళ్ల తరువాత మళ్ళీ ఆ దర్శకుడితో డార్లింగ్ మూవీ!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా మొత్తంలో అందరి హీరోల కంటే ఎక్కువగా సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చిన నటుడు. డార్లింగ్ ఎలాంటి సినిమా చేసినా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే వస్తాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ప్రస్తుతం లైనప్ చూస్తుంటే మరో కొత్త సినిమాను ఇప్పట్లో అయితే ఎనౌన్స్ చేసే అవకాశం లేదని అర్ధమవుతోంది. ఇక 25వ సినిమాపై మాత్రం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వరుసగా సిక్స్ కమిట్మెంట్స్
డార్లింగ్ ప్రభాస్ లైనప్ మామూలుగా లేదు. అగ్ర హీరోల్లో ఇప్పుడు ఎక్కువగా 6 సినిమాలను లైన్ లో పెట్టిన ఏకైక హీరో ప్రభాస్. ముందుగా 20వ సినిమా రాధేశ్యామ్ ను విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన పనులన్ని దాదాపు ఏండింగ్ కు వచ్చేశాయి. చిన్న టీజర్ కూడా వచ్చేసింది. ఇక సినిమాను జూలై 31న విడుదల చేయనున్న విషయం తెలిసిందే.

వచ్చే ఏడాది సంక్రాంతికి..
రాధేశ్యామ్ అనంతరం 21వ సినిమాగా సలార్ రానుంది. KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే ఆ సినిమా షూటింగ్ కూడా ఇటీవల స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఒక స్పెషల్ షెడ్యూల్ ను ప్లాన్ చేసుకున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఎలాగైనా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని కష్టపడుతున్నాడు.

రాముడి పాత్రలో..
ఇక 22వ ప్రాజెక్ట్ ఆదిపురుష్ తో కూడా ప్రభాస్ సరికొత్త కిక్కివ్వబోతున్నట్లు తెలుస్తోంది. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కబోతున్న ఆ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. పూర్తిగా VFX సపోర్ట్ తోనే ఆ సినిమాను షూట్ చేస్తున్నారు. ఇక ఆ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే.

25వ సినిమా వారితోనే..
23వ సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతోంది. మరో బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తో 24వ సినిమా చేయబోతున్న ప్రభాస్ మైత్రి మూవీ మేకర్స్ తో 25వ సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చాడు. కానీ ఇంకా ఆ సినిమాకు దర్శకుడు సెట్టవ్వలేదు. దీంతో దర్శకుడు ఎవరనే విషయంలో అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

10 ఏళ్ళ తరువాత మిర్చి దర్శకుడితో..
మైత్రి మూవీ మేకర్స్ ఆలోచనలో అయితే కొరటాల శివ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న కొరటాల ఆ తరువాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయనున్నాడు. 2013లో ప్రభాస్ మిర్చి సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ ప్రభాస్ 25వ సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సెట్టయితే సెట్స్ పైకి రావడానికి మరో మూడేళ్లు పట్టవచ్చు. అంటే పదేళ్ల తరువాత కొరటాల శివ, ప్రభాస్ కాంబో సెట్టవుతుందన్నామట.


Click it and Unblock the Notifications











