‘సాహో’లో కేవలం యాక్షన్ మాత్రమేనా? ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే అంశాలున్నాయా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన 'సాహో' మూవీ ఆగస్టు 30న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ బాధ్యత తన భుజాలపైనే వేసుకున్న యంగ్ రెబల్ స్టార్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
యాక్షన్ థ్రిల్లర్ అంటే యూత్ ఎక్కువ ఎట్రాక్ట్ అవుతారు. మరి 'సాహో'లో ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే అంశాలు ఉన్నాయా? అని అడిగిన ప్రశ్నకు ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు లవ్ స్టోరీ, రొమాన్స్, గుడ్ ఎమోషన్స్ ఉన్నాయి. సినిమా మొత్తం యాక్షన్ ఉంటే అభిమానులకు కూడా నచ్చదు. సినిమాలో మంచి కథ ఉంటుంది అన్నారు.

'సాహో' సినిమాకు సంబంధించి ఇప్పపటికే కొన్ని పాటలు విడుదల చేశాం. ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసే అంశాలు చాలా ఉన్నాయి. ఈ సినిమా వారికి కూడా నచ్చుతుంది అని ప్రభాస్ తెలిపారు. 'సాహో' చిత్రాన్ని మొదట రూ. 150 కోట్ల బడ్జెట్లో అనుకున్నాం. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకపోవడంతో బడ్జెట్ పెరిగిందని ప్రభాస్ తెలిపారు.
సాహో మూవీ విషయానికొస్తే.... సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ వారు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్యాన్ ఇండియా మూవీగా నాలుగు భాషల్లో విడుదలవుతున్న
ఈ చిత్రంలో ప్రభాస్, శ్రద్ధా కపూర్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, అరుణ్ విజయ్, ఎవలీన్ శర్మ, మందిరా బేడీ తదితరులు ముఖ్య పాతలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











