ఆస్ట్రియాలో ‘సాహో’ షూటింగ్ అద్భుతమైన అనుభూతి: ప్రభాస్
ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం 'సాహో' షూటింగ్ ఇటీవల ఆస్ట్రియా దేశంలో జరిగిన సంగతి తెలిసిందే. ఇక్కడ ప్రభాస్, శ్రద్ధా కపూర్‌పై రొమాంటిక్ సాంగ్స్ చిత్రీకరించారు. మంచు కొండల్లో షూటింగ్ కోసం 1368 అడుగుల ఎత్తులో కేబుల్ కార్స్ ద్వారా చిత్ర బృందం ప్రయాణించింది.
ఆస్ట్రియాలోని ఇన్స్‌బ్రక్, టిరోల్ ప్రాంతంలో షూటింగ్ నాకు ఎంతగానో నచ్చింది. ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉంది, మరుపురాని అనుభూతి అంటూ ప్రభాస్ తాజాగా తన ఫేస్ బుక్ పేజీ ద్వారా వెల్లడిస్తూ అభిమానులతో షూటింగుకు సంబంధించిన ఓ ఫోటో పంచుకున్నారు.

ఆస్ట్రియా షెడ్యూల్‌లో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ ఆధ్వర్యంలో రొమాంటిక్ సాంగ్స్ చిత్రీకరించారు. 'సాహో' చిత్రాన్ని మూడు భాషల్లో భారీ బడ్జెట్‌తో యువి క్రియెషన్స్ బ్యానర్‌లో వంశి, ప్రమెద్, విక్రమ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఆస్ట్రియా షెడ్యూల్ ముగియడంతో 'సాహో' టోటల్ షూటింగ్ పూర్తయినట్లయింది. ఇప్పటికే ఈ మూవీికి సంబంధించిన టాకీ పార్ట్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలవనుంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే సందర్భంగా అగస్ట్ 15న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.


Click it and Unblock the Notifications











