Adipurush: 'సాహో'లానే 'ఆదిపురుష్'.. ఒక్కరోజే రికార్డ్ స్థాయి షోలు.. టికెట్ రేట్స్ ఎంతంటే?
రామాయణం ఆధారంగా తెరకెక్కిన ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. శ్రీరాముడిగా ప్రభాస్ అలరించిన ఈ సినిమాలో రావణబ్రహ్మగా సైఫ్ అలీ ఖాన్, సీతాదేవిగా కృతి సనన్ నటించిన విషయం తెలిసిందే. ఇక హనుమంతుడి పాత్రలో దేవదత్తా, లక్ష్మణుడిగా బాలీవుడ్ హీరో సన్నీ సింగ్ చేశారు. ప్రముఖ హిందీ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్ని విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న విడుదల అయింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒక్కో క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేస్తూ భారీ అంచనాలు పెంచేస్తున్నాడు. ఇక ఎట్టకేలకు ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురచూసిన రామాయణ మహా కావ్యంతో తెరకెక్కిన ఆదిపురుష్ ఇవాళ అంటే జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతలు విడుదల చేశారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ షోలపై ఆసక్తి నెలకొంది.

హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ లో ఆదిపురుష్ టికెట్ ధరలు రూ. 400 (గోల్డ్+3డీ) నుంచి ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ మొత్తంలోనే అత్యంథ ఖరీదైన టికెట్ ధరలు ఈ థియేటర్ లోనే ఉన్నప్పటికీ.. అవి అత్యంత త్వరగా అమ్ముడుపోయాయి. సినీ ప్లెక్స్ థియేటర్ లోను అదే జరిగింది. మిగతా మల్టీ ప్లెక్స్ లలో టికెట్ రేట్స్ రూ. 325 (సాధారణ), రూ. 352 (ఎగ్జిక్యూటివ్), రూ. 380 (వీఐపీ)గా ఉన్నాయి.
అలాగే గచ్చిబౌలిలోని ప్లాటినం మూవీ టైం సినిమా థియేటర్ లో త్రీడీ సిల్వర్ క్లాస్ టికెట్ ధర రూ. 325, నిజాంపేట్ జీపీఆర్ లో కూడా రూ. 325 (3డీ గోల్డ్ క్లాస్), రూ. 380 (3డీ సోఫా)గా విక్రయించారు. ఇక తెలుగు సినిమాకు అడ్డా అయినటువంటి హైదరాబాద్ సిటీలో కేవలం ఇవాళ ఒక్కరోజే అంటే విడుదలైన శుక్రవారం రోజున ఆదిపురుష్ సినిమాకు వెయ్యికి పైగా షోలు పడ్డాయని సమాచారం. బెనిఫిట్ షోలను కూడా కలిపితే వెయ్యికి పైగా ఉంటాయట. ఇంతకుముందు సాహో సినిమాకు కూడా వెయ్యి షోలు పడ్డాయి. మళ్లీ ఇప్పుడు అలాగే షోల సంఖ్య రిపీట్ కావడం ప్రభాస్ క్రేజ్ చూపించడమే కాకుండా అది రికార్డ్ గా మారింది.


Click it and Unblock the Notifications











