Adipurush: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్.. ప్రభాస్ డైలాగ్స్, యాక్షన్‌కు విజిల్సే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి ఆదిపురుష్. రామాయణ గాథతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ భారీగానే నెలకొన్నాయి. అయితే ఈ సినిమా మొదటి నుంచి పలు వివాదాలు, విమర్శలకు గురి అవుతూ వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమాపై డార్లింగ్ అభిమానులు మాత్రం గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగినట్లుగా ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ఉండటంతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పుడు తాజాగా ఆదిపురుష్ ప్రీ రలీజ్ వేడుకలో ఫైనల్ యాక్షన్ ట్రైలర్ రిలీజ్ చేసి ట్రీట్ ఇచ్చారు.
ఇండియా వైడ్ ప్రమోషన్స్: గ్లోబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా అలరించేందుకు వస్తున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వం వహించిన ఈ పౌరాణిక చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయనున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ ప్రేక్షకులలో విపరీతమైన బజ్‌ని క్రియేట్ చేస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం.

తిరుపతిలో వేడుక: ఆదిపురుష్ పై ఉన్న అంచనాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. ప్రమోషన్స్ లో భాగంగానే ఇటీవల ట్రైలర్, సాంగ్స్ విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైభవంగా తిరుపతిలో నిర్వహిస్తున్నారు.

లక్ష్మణ రేఖ దాటగా: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించగా.. ముఖ్య అతిథిగా చిన జీయర్ స్వామి హాజరు అయ్యారు. ఇదిలా ఉంటే ఈ వేడుక సందర్భంగా ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇదే ఆదిపురుష్ యాక్షన్ ట్రైలర్. ఇక ట్రైలర్ లో రావణుడికి భిక్షం వేసేందుకు సీతాదేవి లక్ష్మణ రేఖ దాటగానే ఆమెను అపహరించుకుని వెళ్లే సీన్ ప్రారంభం కాగా అది హైలెట్ గా ఉంది.

అదిరిపోయిన ప్రభాస్ డైలాగ్స్: "వస్తున్నా రావణా.. న్యాయం రెండు పాదాలతో పది తలల అన్యాయాన్ని అణిచివేయడానికి వస్తున్నా.. నా జానకిని తీసుకెళ్లడానికి. నా ఆగమనం అధర్మ విధ్వంసం" అని ఆవేశంతో చెప్పిన ప్రభాస్ డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. అలాగే వానర సేనను యుద్ధానికి సిద్ధం చేసే క్రమంలో చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.
ఆకట్టుకునే విధంగా: ఇక రామాయణం గాథకు ఆదిపురుష్ మధ్య ఉన్న తేడా గ్రాఫిక్స్ విజువల్స్ అని ట్రైలర్ చూస్తుంటే స్పష్టంగా తెలుస్తోంది. ప్రత్యేకించి యుద్ధ సన్నివేశాలను థియేటర్లలో చూస్తున్నప్పుడు కొత్త అనుభవం పొందచ్చని అర్థం అవుతోంది. వానర సేన పోరాటం, హనుమంతుడి సాయం, రావణుడి అంతాన్ని చూపించిన ఆదిపురుష్ యాక్షన్ ట్రైలర్ చాలా బాగా ఆకట్టుకునే విధంగా ఉంది.


Click it and Unblock the Notifications











