Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. రాముడు వచ్చేశాడు!

హీరోగా కెరీర్ ఆరంభించినప్పటి నుంచి తెలుగు సినిమాలకే పరిమితమైనా.. 'బాహుబలి' నుంచి పంథాను మార్చుకుని వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తూ పాన్ ఇండియా స్టార్ అనిపించుకుంటున్నాడు ప్రభాస్. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలను లైన్‌లో పెట్టుకుని.. ఈ యూనివర్శల్ స్టార్ చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. వాటిలో ఒక్కొక్క మూవీని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక, ప్రభాస్ ఇప్పుడు నటిస్తోన్న చిత్రాల్లో పౌరాణిక కథతో వస్తున్న 'ఆదిపురుష్' చాలా ప్రత్యేకమైనది చెప్పవచ్చు. దీనికి కారణం ఇది నేరుగా హిందీలో రూపొందడమే అన్న విషయం తెలిసిందే.

బాలీవుడ్‌లో చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఓం రౌత్ రూపకల్పనలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. దీని ద్వారా మన స్టార్ హీరో బాలీవుడ్‌లోకి నేరుగా ఎంట్రీ ఇస్తున్నాడు. రామాయణంలో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. చెడు మీద మంచి ఎలా గెలిచింది అన్న కాన్సెప్టును ఇందులో చూపించబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. విజువల్ వండర్‌గా వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే ముగిసింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

Prabhas Adipurush First Look Poster Released

వీఎఫ్ఎక్స్ వండర్‌గా రూపొందుతోన్న 'ఆదిపురుష్' మూవీ నుంచి ఇప్పటి వరకూ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల కాలేదు. వాస్తవానికి దీన్ని గత ఏడాదే రిలీజ్ చేస్తారని అనుకున్నారు. ఆ తర్వాత ఈ సంవత్సరం శ్రీరామ నవమికి వదులుతారని ప్రచారం జరిగింది. కానీ, అలా జరగలేదు. దీంతో ప్రభాస్ పుట్టినరోజు నుంచి ఈ సినిమా అప్‌డేట్లను వదులుతారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలారు. ఇందులో అతడు శ్రీరాముడి గెటప్‌తో దర్శనమిస్తున్నాడు. ఫలితంగా ఈ పోస్టర్‌కు తక్కువ సమయంలోనే భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది వైరల్‌గా మారిపోయింది. అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను అక్టోబర్ 2వ తేదీన విడుదల చేస్తున్నట్లు కూడా చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తోన్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు. వీళ్లతో పాటు ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X