Adipurush 'జై శ్రీరామ్' సాంగ్ రికార్డ్.. 24 గంటల్లో వ్యూస్ ఎంతో తెలిస్తే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే అందులో ప్రేక్షకుల ముందుకు ముందుగా వచ్చేది, రాముడిగా ప్రభాస్ ఆకట్టుకునే సినిమా ఆదిపురుష్. సాహో, రాధేశ్యామ్ వంటి ఓటమి తర్వాత అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు వస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. అప్పట్లో వచ్చిన టీజర్ తప్పా ఈ మధ్య వచ్చిన ట్రైలర్, పోస్టర్స్, పాటలకు మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఇక ఇటీవలే విడుదలైన 'జై శ్రీరామ్' పాటను పూర్తిగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ రికార్డ్ క్రియేట్ చేస్తోంది.
గ్లోబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా అలరించేందుకు వస్తున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వం వహించిన ఈ పౌరాణిక చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయనున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ ప్రేక్షకులలో విపరీతమైన బజ్‌ని క్రియేట్ చేస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. ప్రమోషన్స్ లో భాగంగానే ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. ఆదిపురుష్ ట్రైలర్ చూసినవారికి అంతకుముందు సినిమాపై ఉన్న నెగెటివిటీ ఒక్కసారిగా తొలగిపోయింది.

తాజాగా ఆదిపురుష్ సినిమాలోని 'జై శ్రీరామ్' ఫుల్ సాంగ్ విడుదల చేశారు. మహిమాన్విత మంత్రం నీ నామం అంటూ సాగే ఈ పాట యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. యూట్యూబ్ లో 24 గంటల్లో అత్యధికంగా వీక్షణలు పొందిన వీడియోగా రికార్డ్ సాధించింది. ఇప్పటికీ ఈ పాటకు 31, 607, 790కిపైగా వ్యూస్ రాగా.. 5 లక్షల 67 వేలకు పైగా లైక్ లు వచ్చాయి. ప్రముఖ సంగీత దర్శకులు అజయ్-అతుల్ పాటకు స్వరాలు అందించారు.
జై శ్రీరామ్ పాటకు హిందీలో మనోజ్ ముంతాషీర్, తెలుగులో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాటకు వస్తున్న ఆదరణపై అజయ్ సంతోషం వ్యక్తం చేశారు. "ఇది ఈ సినిమాకు మేము కంపోజ్ చేసిన తొలి పాట. శ్రీరాముడి పేరు వినగానే ఆ శక్తి, భక్తి అటోమాటిక్ గా ఈ పాటలోకి వచ్చేశాయి. పాటకు లభిస్తున్న ఆదరణ, ప్రేమ పట్ల ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశం రావడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. ఈ పాటను 30 మంది టీమ్ కలిసి పాడారు" అని మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











