Adipurush సెన్సార్ కంప్లీట్.. విడుదలకు ముందే పాజిటివ్ బజ్.. రన్ టైమ్ ఎంతంటే?
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాతో జూన్ 16న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీని ఓం రౌత్ విజువల్ గ్రాండియర్ గా ఆవిష్కరించారు. రామాయణంలోని కీలక ఘట్టాలైన అరణ్య ఖండ, యుద్ధ ఖండలని ప్రధాన ఇతివృత్తంగా చేసుకొని ఆదిపురుష్ చిత్రాన్ని ఓం రౌత్ చూపించబోతున్నారు.
ఇక ఈ చిత్రంలో కృతి సనన్ సీతాదేవి పాత్రలో కనిపించబోతూ ఉండగా, సైఫ్ ఆలీఖాన్ లంకేష్ రావణుడిగా దర్శనం ఇవ్వబోతున్నాడు. ప్రధానంగా ఈ మూడు పాత్రలతోనే కథాగమనం ఉంటుంది. ఇక హాలీవుడ్ స్టాండర్డ్స్ లో మన ఇతిహాస కథని, అందులో పాత్రలని ప్రపంచ స్థాయిలో ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా ఓం రౌత్ ఆదిపురుష్ ని సిద్ధం చేశారు.

తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో ఆదిపురుష్ యాక్షన్ ట్రైలర్ ని విడిచిపెట్టి మూవీమీద మరింతగా అంచనాలు పెంచేశారు. కచ్చితంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆదిపురుష్ ఒక సెన్సేషన్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ పై చిత్ర యూనిట్ పూర్తిగా ఫోకస్ పెట్టింది.
ఆదిపురుష్ మూవీ సెన్సార్ తాజాగా కంప్లీట్ అయ్యింది. సినిమాకి సెన్సార్ సభ్యులు యూ సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా చూడదగ్గ చిత్రం ఆదిపురుష్ అని సెన్సార్ నుంచి స్పష్టత వచ్చింది. ఇక మూవీ నిడివి నిమిషం తక్కువ మూడు గంటలు ఉంటుందంట. అంటే హాలీవుడ్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ తరహాలో చాలా పెద్ద చిత్రం అని చెప్పాలి.
మరి డార్లింగ్ ప్రభాస్ అంత సమయం ఆడియన్స్ ని కుర్చీలలో కదలకుండా కూర్చోబెడతాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాని వృద్ధులకి, అనాధలకి ఫ్రీగా చూపించడం కోసం పది వేల టికెట్లు ఫ్రీగా ఇవ్వడానికి చిత్రం యూనిట్ ముందుకొచ్చింది. దానికోసం ప్రత్యేకంగా గూగుల్ ఫామ్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.


Click it and Unblock the Notifications











