For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Adipurush Teaser: ఆదిపురుష్ టీజర్ పై ట్రోలింగ్ ఒకవైపు.. అక్కడ రికార్డుల మోత మరోవైపు

  |

  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఎంతోమంది రామ భక్తులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆదిపురుష్. దీంతో ఈ సినిమా ఇటు టాలీవుడ్ తోపాటు అటు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో ఈ సినిమా నుంచి ఒక్క అప్ డేట్ అయిన వస్తే చాలు అనుకున్న వాళ్లు అనేకం. ఈ క్రమంలోనే ఆదివారం ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో సరయు నది ఒడ్డున విడుదల చేశారు. అయితే టీజర్ తప్పకుండా సినిమాపై అంచనాలను క్రియేట్ చేస్తుంది అనుకుంటే ఊహించిన విధంగా నిరాశపరిచింది. కానీ ఎవరూ ఊహించని విధంగా అక్కడ మాత్రం సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఆదిపురుష్ టీజర్.

  సినిమాపై అంచనాలు..

  సినిమాపై అంచనాలు..


  బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఆదిపురుష్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామాయణం బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తూ ఉండగా సీత పాత్ర కోసం కృతి సనోన్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇక రావణాసుర పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నాడు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పుడే భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి.

   ఒక్కసారిగా షాక్..

  ఒక్కసారిగా షాక్..


  ఇక ఈ సినిమాకు సంబంధించిన మొదటి టీజర్ ను ఆదివారం రోజు విడుదల చేయగా ప్రేక్షకుల ఒక్కసారిగా షాక్ అయ్యారు. కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ టీజర్ పై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ సినిమా కోసం నిజంగానే 500 కోట్లు ఖర్చుపెట్టారా అనేక రకాలు ఎక్కువగా కామెంట్ చేస్తున్నారు.

   త్రీడీ మోషన్ పిక్చర్ క్వాలిటీ..

  త్రీడీ మోషన్ పిక్చర్ క్వాలిటీ..

  త్రీడీ మోషన్ పిక్చర్ క్వాలిటీతో ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నట్లుగా ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చినప్పటికీ అదేమీ అంత క్వాలిటీతో లేదు అని అసలు చిన్న పిల్లలు చూసే బొమ్మల తరహాలో గ్రాఫిక్స్ ఉంది అని ఆవేదన చెందుతున్నారు. అసలు ఈ రేంజ్ లో ఉంటుంది అని ఊహించలేదు అని దర్శకుడు ఇన్ని రోజులు కష్టపడింది దీని కోసమా అని షాక్ అవుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో మరికొందరు ఇదే అవకాశం గా భావించి చాలా దారుణంగా అయితే ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పటికి నెగిటివ్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

  మరోవైపు రికార్డు..

  మరోవైపు రికార్డు..

  ఇదంతా ఒకవైపు, కానీ మరోవైపు ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ రికార్డు క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఆదిపురుష్ హిందీ టీజర్ విడుదలైన 16 గంటల్లోనే అత్యధికంగా లైక్ చేసిన టీజర్ గా చరిత్ర సృష్టించింది. కేవలం 16 గంటల్లో 9 లక్షల 32 వేలకు పైగా మంది ఈ హిందీ టీజర్ ను లైక్ చేశారు. అలాగో 56 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఈ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు హిందీ సినిమా టీజర్లలో 24 గంటల్లో అత్యధిక మంది లైక్ చేసిన టీజర్ గా ఆదిపురుష్ రికార్టు నమోదు చేసింది. ఈ రికార్డును కూడా కేవలం 16 గంటల్లో నెలకొల్పడం విశేషం. అంతకుముందు విక్రమ్ వేద టీజర్ కు 24 గంటల్లో 9 లక్షల 31 వేలు, షంషేరా టీజర్ కు 7 లక్షల 10 వేల లైక్స్ వచ్చాయి.

  24 గంటల్లో 11 లక్షల లైక్స్..

  ఇక ప్రస్తుతం ఆదిపురుష్ హిందీ టీజర్ 24 గంటల్లో 11 లక్షల లైక్స్ ను సొంతం చేసుకుంది. అలాగే 7.2 కోట్ల వీక్షణలు దాటాయి. ఒకవైపు టీజర్ పై మీమ్స్, ట్రోలింగ్ జరుగుతున్న హిందీ టీజర్ మాత్రం ఈ విధంగా దూసుకుపోవడం విశేషంగా మారింది. ఇదిలా ఉండగా.. 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తోన్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు. వీళ్లతో పాటు ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేస్తున్నారు.

  English summary
  Prabhas Kriti Sanon Saif Ali Khan Starrer Movie Adipurush Movie Hindi Teaser Creating Records In Bollywood. And Gets 11 Lakhs Likes In 24 Hours.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X