Adipurush Postpone: ఆదిపురుష్ నుంచి సంచలన ప్రకటన.. ఆగిపోయిన ప్రభాస్ మూవీ రిలీజ్
తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించి.. కొంత కాలంగా పాన్ ఇండియాపై దండయాత్ర చేస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఏకకాలంలో ఎన్నో సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తోన్న చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్' ఒకటి. ఈ మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. కానీ, ఇది వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆదిపురుష్ మూవీ పోస్ట్‌పోన్ అయినట్లు ప్రకటించారు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

బాలీవుడ్‌లోకి ప్రభాస్ ఎంట్రీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఆదిపురుష్' అనే చారిత్రక సినిమాలోనూ నటిస్తున్నాడు. దీంతో బాలీవుడ్‌లోకి ప్రవేశిస్తున్నాడు. ఈ మూవీ పాన్ వరల్డ్ రేంజ్‌లో రామయణం నేపథ్యంతో రూపొందుతోంది. చెడుపై మంచి గెలవడం అనే కాన్సెప్టుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రామాయణంలోని ప్రధానమైన థీమ్‌ను తీసుకుని ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

పాన్ వరల్డ్ రేంజ్.. స్టార్లంతా
బాలీవుడ్ స్టార్ ఓం రౌత్ డైరెక్షన్‌లో ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. ఇందులో రెబెల్ స్టార్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను, దేవదుత్తా హనుమంతుడి పాత్రను చేస్తున్నాడు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మిస్తున్నారు.

షూట్ కంప్లీట్.. దానికే అంతా
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'ఆదిపురుష్' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోన్న సమయంలో కరోనా సెకెండ్ వేవ్ దానికి బ్రేక్ వేసింది. దీంతో ఆ మధ్య నిలిచిపోయిన ఈ సినిమా షూట్ టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ఆ వెంటనే చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలెట్టింది. గ్రాఫిక్స్ ఎక్కువ ఉండడం వల్ల దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని తెలిసింది.

సంక్రాంతికి.. వాయిదా అని
పాన్ వరల్డ్ రేంజ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, దీన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, ఈ మూవీని వాయిదా వేయబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ అందరూ దీనిపై అయోమయంగా ఉండిపోయారు.

ఆదిపురుష్ నుంచి ప్రకటన
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'ఆదిపురుష్' మూవీ విడుదలపై వస్తున్న పుకార్లను నిజం చేస్తూ తాజాగా చిత్ర యూనిట్ ఓ ప్రకటనను వదిలింది. ఇందులో ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం లేదని అధికారికంగా వెల్లడించింది. అంతేకాదు, ఈ మూవీని 2023, జూన్ 16న విడుదల చేయబోతున్నట్లు కూడా ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు.

ఆదిపురుష్ సినిమానే కాదు
'ఆదిపురుష్' యూనిట్ వదిలిన ప్రకటనలో 'ఆదిపురుష్ అనేది సినిమా కాదు.. ప్రభు శ్రీరాముడి పట్ల మనకున్న భక్తికి, మన సంస్కృతి, చరిత్ర పట్ల నిబద్ధతకు నిలువెత్తు రూపం. ప్రేక్షకులకు పూర్తి విజువల్ ట్రీట్‌ను అందించాలంటే సినిమా కోసం పని చేస్తున్న టీమ్‌లకు ఎక్కువ సమయం కేటాయించాలి. అందుకే దీన్ని వాయిదా వేస్తున్నాం. భారతదేశం గర్వించదగ్గ సినిమా చేయబోతున్నాం. దీనికి మీ మద్దతు, ప్రేమ కావాలని కోరుకుంటున్నాం' అంటూ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











