Prabhas: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్... ముఖ్యఅతిథిగా రాబోతున్న ఊహించని అతిధి!
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జూన్ 16వ తేదీన ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. రామాయణం ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ మూవీకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ట్రైలర్, సాంగ్స్ భారీగానే హైప్ క్రియేట్ చేశాయి. అలాగే మొదటిసారి రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనుండడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు. జూన్ 16న ఈ సినిమా రిలీజ్ కాబోతుండడంతో ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్.

ఈ క్రమంలో తిరుపతిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. జూన్ 6న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున నిర్వహించనున్నారు. అయితే తాజాగా ఈ ఈవెంట్ గురించి మరో అప్డేట్ వచ్చింది. ఈ తిరుపతిలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా చిన జీయర్ స్వామి రానున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇక గత రెండు రోజులుగా ఈ వేడుక పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ ను భారీ ఖర్చుతో నిర్వహిస్తుండగా.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ వన్ ఆఫ్ ది బెస్ట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నిన్న ప్రధాన వేదిక పనులు షూరు అయ్యాయి. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.
అలాగే పనులకు సంబంధించిన వీడియోస్ షేర్ చేయగా.. నెట్టింట వైరలవుతున్నాయి. ఇక ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. జూన్ 16 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ సృష్టించనుందో చూడాలి.


Click it and Unblock the Notifications











