For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Adipurush Teaser: అదిరిపోయే విజువల్స్ తో ప్రభాస్ ఆదిపురుష్ టీజర్.. హైలెట్ గా ఆ సీన్..

  |

  ఈశ్వర్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. ఆ తర్వాత అనేక హిట్ సినిమాలు చేసిన ప్రభాస్ 'బాహుబలి' చిత్రం నుంచి తన పంథాను మార్చుకుని వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తూ పాన్ ఇండియా స్టార్ అనిపించుకుంటున్నాడు ప్రభాస్. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలను లైన్‌లో పెట్టుకుని.. ఈ యూనివర్శల్ స్టార్ చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. వాటిలో ఒక్కొక్క మూవీని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక, ప్రభాస్ తాజాగా నటించిన పౌరాణిక కథా చిత్రం 'ఆదిపురుష్'. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఆ టీజర్ విశేషాలేంటో చూద్దాం.

   గ్రాఫిక్స్, విజువల్స్ తో ..

  గ్రాఫిక్స్, విజువల్స్ తో ..


  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆదిపురుష్. ఈ మూవీ టీజర్ ను అక్టోబర్ 2న విడుదల చేస్తామని ఇటీవల చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు తగినట్లుగా ఆదివారం ఆదిపురుష్ టీజర్ ను రిలీజ్ చేసింది. ఒక నిమిషం 46 సెకన్ల పాటు సాగిన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. గ్రాఫిక్స్, విజువల్స్ తో ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించే విధంగా ఉంది.

  నీళ్లలో కూర్చుని తపస్సు చేసే సీన్..

  నీళ్లలో కూర్చుని తపస్సు చేసే సీన్..

  రాముడిగా ప్రభాస్ నీళ్లలో కూర్చుని తపస్సు చేసే సీన్ టీజర్ కే హైలెట్ గా ఉంది. భూమి కుంగిన నింగి చీలిన న్యాయం చేతిల్లోనే అన్యాయానికి సర్వనాశనం. వస్తున్న న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణచివేయడానికి. ఆగమనం.. అధర్మ విధ్వంసం అని ప్రభాస్ చెప్పే డైలాగ్ లు అలరిస్తున్నాయి. అంతేకాకుండా ప్రభాస్, కృతీ సనన్ మధ్య వచ్చిన పూల తోటలోని సీన్లు మంచి అనుభూతిని కలిగించే విధంగా ఉన్నాయి. అలాగే ఊయలపై కృతీ సనన్ ఊగడం కలర్ ఫుల్ గా ఉంది. పోరాట సన్నివేశాలు, విజువల్స్ అదిరిపోయాయనే చెప్పుకోవచ్చు. ఇక రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటన అద్భుతంగా ఉంది.

  రాముడిగా ప్రభాస్ నడుచుకుంటూ రావడం..

  రాముడిగా ప్రభాస్ నడుచుకుంటూ రావడం..

  అలాగే రామసేతుపై రాముడిగా ప్రభాస్ నడుచుకుంటూ రావడం, లంకేశ్వరుడిగా సైఫ్ అలీఖాన్ క్రూరత్వం, రాక్షసులను డిజైన్ చేసిన విధానం మెప్పించేలా ఉంది. పూల
  జై శ్రీరామ్.. జై శ్రీరామ్ అంటూ టీజర్ ను ముగించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే సంవత్సరం జనవరి 12న విడుదల కానున్నట్లు టీజర్ లో తెలిపారు. కాగా బాలీవుడ్‌లో చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఓం రౌత్ రూపకల్పనలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. దీని ద్వారా మన స్టార్ హీరో బాలీవుడ్‌లోకి నేరుగా ఎంట్రీ ఇస్తున్నాడు.

   ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో..

  ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో..

  రామాయణంలో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. చెడు మీద మంచి ఎలా గెలిచింది అన్న కాన్సెప్టును ఇందులో చూపించబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. విజువల్ వండర్‌గా వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే ముగిసింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

  గతేడాదే రిలీజ్ చేస్తారని ..

  గతేడాదే రిలీజ్ చేస్తారని ..

  వీఎఫ్ఎక్స్ వండర్‌గా రూపొందుతోన్న 'ఆదిపురుష్' మూవీ నుంచి ఇప్పటి వరకూ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల కాలేదు. వాస్తవానికి దీన్ని గతేడాదే రిలీజ్ చేస్తారని అనుకున్నారు. ఆ తర్వాత ఈ సంవత్సరం శ్రీరామ నవమికి వదులుతారని ప్రచారం జరిగింది. కానీ, అలా జరగలేదు. దీంతో ప్రభాస్ పుట్టినరోజు నుంచి ఈ సినిమా అప్‌డేట్లను వదులుతారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలారు. ఇందులో ప్రభాస్ శ్రీరాముడి గెటప్‌తో దర్శనమిస్తున్నాడు. ఫలితంగా ఈ పోస్టర్‌కు తక్కువ సమయంలోనే భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ పోస్టర్ వైరల్‌గా మారిపోయింది.

  రావణుడిగా సైఫ్ అలీ ఖాన్..

  ఇదిలా ఉండగా.. 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తోన్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు. వీళ్లతో పాటు ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేస్తున్నారు.

  English summary
  Prabhas Kriti Sanon Saif Ali Khan Starrer Movie Adipurush Movie Teaser Released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X