‘ఆదిపురుష్’కు ఆరంభంలోనే అపశకునం.. సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం

ప్రభాస్ ఓం రావత్ సైఫ్ అలీ ఖాన్ కాంబోలో రాబోతోన్న ఆదిపురుష్ సినిమాకు ఆదిలోనే ఆటంకం ఏర్పడింది. ఆది పురుష్ ఆరంభ్ అంటూ ఎంతో ఘనంగా నేడు మూవీ షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ మేరకు ముంబైలోని గోరే గావ్‌లో ఓ భారీ సెట్‌ను వేశారు. అయితే అంతా బాగానే జరుగుతుందనే సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయని తెలుస్తోంది. ఈ క్రమంలో యూనిట్ మొత్తం ఆందోళనకు గురైంది.

అయితే ప్రాణాపాయం ఏమీ లేకపోయినా సెట్ అంతా మంటల్లో చిక్కుకుని దగ్దమైనట్టు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదానికి కారణం మాత్రం బయటకు రాలేదు. పైగా ఈ ఘటన జరిగిందంటూ ఇంత వరకు ఎవ్వరూ కూడా అధికారికంగా ధృవీకరించలేదు. ఇకనైనా ఆది పురుష్ టీం ఈ ఘటనపై స్పందిస్తుందా? లేదా? అన్నది చూడాలి. మరో వైపు అది అసలు ఆది పురుస్ సెట్టేనా? అనే అనుమానాలను కూడా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.

Prabhas Adipurush Set on fire

మొత్తానికి ఈ మూవీ ఆరంభంలోనే ఇలా నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సీతగా కృతి సనన్, కౌసల్యగా హేమమాలిని, లక్ష్మణుడిగా సన్నీ సింగ్... రావణాసురుడి కుమారుడు మేఘనాథుడిగా అంగద్ బేడీలు నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 11న రిలీజ్ కానుంది. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ చిత్రంతో బిజీగా ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X