Adipurush టీమ్ షాకింగ్ డిసిషన్.. ఆ కారణంగా సినిమాలో ఊహించని మార్పులు!
ఆదిపురుష్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విడుదల ముందుకు ఈ సినిమాపై భారీ హైప్, పాజిటివ్ బజ్ వచ్చింది. దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ విడుదల అయిన మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీనికి కారణం ఈ సినిమాలో ఉండే పాత్రల ఆహార్యం, డైలాగులు, గ్రాఫిక్స్ వంటివి ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోవడమే.
మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా మంచి వసూళ్లనే సాధించింది. మొదటి రోజు 140 కోట్ల గ్రాస్ సాధించింది. అయితే ఈ సినిమాలోని హనుమంతుడి డైలాగ్స్ తో పాటు.. పలు సంభాషణలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా హనుమంతుడి డైలాగ్స్ ఊర మాస్ లాగా ఉన్నాయని ట్రోల్స్ వస్తున్నాయి.

దీనితో చిత్ర యూనిట్ కూడా స్పందించింది. కొంత మంది సూచనల మేరకు ఈ సినిమాలోని డైలాగ్స్ మార్చబోతున్నట్లు ప్రకటించింది. సినిమాలో ఇప్పుడున్న ఫీల్ కొనసాగిస్తూనే ఆ మార్చిన సంభాషణలు ఉంటాయని వెల్లడించింది. కొద్ది రోజుల్లోనే ఈ మార్పులతో థియేటర్స్ లో ఆది పురుష్ మళ్లీ చూడవచ్చని సూచించింది.
ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా... మళ్లీ డైలాగులు మార్చి విడుదల చేస్తే.. చూసిన వాళ్లు మళ్లీ చూసే అవకాశం ఉంటుంది. ఇది సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. అయితే డైలాగులు మార్చడం అనేది చిత్ర యూనిట్ కు సాహసం లాంటిదే అని చెప్పవచ్చు. ప్రేక్షకుల మనో భావాలు, సెంటి మెంట్స్, వారి సూచనలు గౌరవించడం అన్నింటి కన్నా ముఖ్యమని దర్శక నిర్మాతలు చెప్పుకొస్తున్నారు.
ఈ సినిమాలోని పాత్రల రూపుపై, డైలాగులపై వస్తున్న విమర్శలతోనే ఇలా చిత్ర యూనిట్ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా రామాయణం ఇతి వృత్తంగా తెరకెక్కింది. రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, సీతగా కృతి సనన్ నటించారు. ఈ చిత్రాన్ని 550 కోట్ల రూపాయలతో టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయూక్తంగా తెరకెక్కించాయి. చూడాలి ఇక రానున్న రోజుల్లో ఎలాంటి రికార్డు వసూళ్లు సాధింస్తుందో.


Click it and Unblock the Notifications











